Pawan Kalyan AP CM Candidate: బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక.. పవన్ కళ్యాణ్ ‘సీఎం క్యాండిటేట్’యేనా?

Pawan Kalyan AP CM Candidate: జనసేనాని పవన్ కళ్యాణ్ కు పట్టాభిషేకం జరుగనుందా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి రావడంతో ఇప్పుడు జనసైనికులంతా ఇదే ఆశలు పెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం అధికార వైసీపీని టార్గెట్ చేసి బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు ఏపీలో పర్యటించిన నడ్డా ఆశ్చర్యకరంగా ఏపీ సీఎం జగన్ ను విమర్శించడం […]

Written By: NARESH, Updated On : June 6, 2022 4:40 pm
Follow us on

Pawan Kalyan AP CM Candidate: జనసేనాని పవన్ కళ్యాణ్ కు పట్టాభిషేకం జరుగనుందా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి రావడంతో ఇప్పుడు జనసైనికులంతా ఇదే ఆశలు పెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం అధికార వైసీపీని టార్గెట్ చేసి బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు ఏపీలో పర్యటించిన నడ్డా ఆశ్చర్యకరంగా ఏపీ సీఎం జగన్ ను విమర్శించడం విశేషం.

Pawan Kalyan, jp nadda

దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. ఏపీలోని విజయవాడలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో మాట్లాడారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ బూత్ లు ఉన్నాయని.. బూతుల వారీగా ప్రజలకు వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్రాలపై ఉందని తెలిపారు.

Also Read: Nityananda Swamy: అట్లుంటది నిత్యానందతోని!.. సమాధిలోకి స్వయం ప్రకటిత దేవుడు..

ఇక అధికార వైసీపీతో ఢిల్లీలో స్నేహంగా ఉంటున్నారు బీజేపీ పెద్దలు.. జగన్ తో మోడీ, అమిత్ షాలు అత్యంత సన్నిహితంగా ఉంటారు. కానీ ఈ పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం జగన్ తో ఢిల్లీలో స్నేహమైనా.. ఏపీ గల్లీలో మాత్రం ఫైటింగ్ చేయడమేనని స్పష్టం చేశారు. ‘కేంద్రం తెచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దాన్నే జగన్ ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. అది జగన్ స్కీం కాదని.. నరేంద్రమోదీదని నడ్డా వ్యాఖ్యానించారు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో రూ.5 లక్షల వరకూ వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు నడ్డా సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పనిచేస్తుందని.. రాష్ట్రం దాటితే ఆరోగ్యశ్రీ పనికిరాదని వ్యాఖ్యానించారు. ఇక పీఎం కిసాన్ పథకాన్ని వాడుకొని జగన్ ఏటా రైతుల ఖాతాల్లో రూ.6వేలు వేస్తున్నారని నడ్డా విమర్శించారు.

Pawan Kalyan, jp nadda

ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలకు నడ్డా దిశానిర్ధేశం చేశారు. ఏపీలో బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను శ్రేణులకు వివరించారు. ప్రజలకు శక్తి కేంద్ర ప్రముఖులు చొరవ చూపాలని కోరారు.

ఇలా ఏపీ పర్యటనలో జగన్ టార్గెట్ గా జేపీ నడ్డా టూర్ సాగింది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇక అందరూ ఎదురుచూసిన బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి ‘పవన్ కళ్యాణ్’ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటిస్తారని అందరూ ఎదురుచూసినా అది సాధ్యం కాలేదు. నడ్డా వెంట ఆ మాట రాలేదు. కానీ జీవీఎల్ మాత్రం అప్పుడే తొందరెందుకు? అన్నట్టుగా హింట్ ఇచ్చారు. సో ఎన్నికల వరకూ పవన్ కు పట్టాభిషేకం చేయడానికి బీజేపీ రెడీ అయినట్లు తెలుస్తోంది.

Also Read:BJP- Congress and TRS: తెలంగాణలో ముక్కోణపు పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో?

Tags