Nityananda Swamy: అట్లుంటది నిత్యానందతోని!.. సమాధిలోకి స్వయం ప్రకటిత దేవుడు..

Nityananda Swamy: నిత్యానంద.. పరిచయం అక్కరలేని పేరు. తమిళనాడుకు చెందిన అరుణాచలం రాజశేఖరన్‌ చిన్నవయసులోనే ఆథ్యాత్మిక గురువుగా ఎదిగి, నిత్యానందస్వామిగా మారారు. తనకు తానే భగవంతుడినని ప్రకటించుకున్నారు. అన తికాలంలోనే లక్షల కోట్లు విలువ చేసే ఆశ్రమాలు, భూములకు అధిపతి కావడం తెలిసిందే. తర్వాతి కాలంలో సినిమా హీరోయిన్లతో ఏకాంతంగా గడుపుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. లైంగిక దాడి ఆరోపణలపై అరెస్టు కావడం.. భారత్‌లో వికృత చేష్టలకు పాల్పడి జైలుపాలై.. బెయిల్‌పై ఉండగానే విదేశాలకు పారిపోవడం చకచకా […]

Written By: Raghava Rao Gara, Updated On : June 6, 2022 4:15 pm
Follow us on

Nityananda Swamy: నిత్యానంద.. పరిచయం అక్కరలేని పేరు. తమిళనాడుకు చెందిన అరుణాచలం రాజశేఖరన్‌ చిన్నవయసులోనే ఆథ్యాత్మిక గురువుగా ఎదిగి, నిత్యానందస్వామిగా మారారు. తనకు తానే భగవంతుడినని ప్రకటించుకున్నారు. అన తికాలంలోనే లక్షల కోట్లు విలువ చేసే ఆశ్రమాలు, భూములకు అధిపతి కావడం తెలిసిందే. తర్వాతి కాలంలో సినిమా హీరోయిన్లతో ఏకాంతంగా గడుపుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. లైంగిక దాడి ఆరోపణలపై అరెస్టు కావడం.. భారత్‌లో వికృత చేష్టలకు పాల్పడి జైలుపాలై.. బెయిల్‌పై ఉండగానే విదేశాలకు పారిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ సొంత దేశాన్ని స్థాపించుకున్నాడు నిత్యానంద. ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొని ఏకంగా కొత్త దేశాన్ని స్థాపించి, దానికి కైలాస అని పేరుపెట్టి, దానికంటూ ప్రత్యేక కరెన్సీ, రాజ్యాంగం రూపొందించి, తన దేశాన్ని గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితికి సైతం అప్పీలు చేసుకుని సంచలనంగా మారాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియోలతో నిత్యం చర్చలో ఉంటాడీ స్వయం ప్రకటిత దేవుడు.

Nityananda Swamy

సమాధిలోకి స్వయం ప్రకటిత దేవుడు..
తాజాగా నిత్యానంద స్వామి గురించి మరో సంచలన వార్త వైరల్‌ అవుతోంది. ఆయన సమాధి ప్రక్రియకు చేపట్టాడు. అయితే స్వామి లీలల్ని సరిగా అర్థంచేసుకోలేకపోయిన భక్తగణం.. ఆయన చనిపోయారంటూ శోకాలు పెట్టింది. తాను చావలేదని, చనిపోయినట్లు జరుగుతోన్న ప్రచారం అంతా వట్టిదేనని, నిజానికి సమాధిలో ఉన్నానని, ఆ స్థితి మరణంగా కొందరు పొరపడ్డారని నిత్యానంద వివరణ ఇచ్చుకున్నాడు. ‘నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను.

Also Read: AP Political Alliance: అధికారం చెరిసగం.. తెరపైకి 50:50 ఫార్ములా

Nityananda swamy

నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది డాక్టర్లు నాకు చికిత్స చేస్తున్నారు’అని నిత్యానంద పెన్నుతో పేపర్‌పై రాస్తున్న వాక్యాల ఫొటోలను కైలాస దేశం అధికారికంగా సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. తరచూ సంచలనాలతో బయటకు వస్తున్న నిత్యానంద.. తాజాగా సమాధిలోకి వెళ్లినట్లు వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read:BJP- Congress and TRS: తెలంగాణలో ముక్కోణపు పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో?

Tags