Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. మాజీ సీఎం జగన్(YS Jagan Mohan Reddy) సత్తెనపల్లి పర్యటనలో భాగంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు పట్టుకొని తిరిగిన ‘రప్పా రప్పా నరుకుతాం’ బ్యానర్స్ ని జగన్ వెనకేసుకొని రావడం పై రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. జగన్ సైతం అనేక సందర్భాల్లో రాబోయేది మా ప్రభుత్వమే, పోలీసుల బట్టలు ఊడదీసి కూర్చోబెడతాం, రిటైర్ అయిపోయినా వదిలిపెట్టము, దేశం దాటినా లాకొచ్చి కూర్చోబెడుతాము వంటి సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలను కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అధినేత నే ఇలా ఉంటే, అతన్ని అనుసరించేవాళ్ళు ఇంకెలా ఉంటారు అంటూ నేడు హోమ్ మంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లతో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ లు,మంత్రులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘లా & ఆర్డర్ కి సంబంధించినంత వరకు అధికార యంత్రాంగం నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో అని, ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు, రావట్లేదు, రానివ్వం. మీ అందరిలో నేను నమ్మకాన్ని కలిగించాలని అనుకుంటున్నాను. మేమందరం వాళ్ళ దాష్టికాన్ని మళ్ళీ సహించడానికి సిద్ధంగా లేము. ఈ కూటమి ప్రభుత్వం 15 నుండి 20 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ కచ్చితంగా వికసిత్ భారత్ లో ఉండాలి, వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ గా తయారు అవ్వాలి. అందుకే మా కూటమి మధ్య ఐక్యత చెడగొట్టేవిధంగా నేను కానీ , ఎవ్వరూ కానీ లేరు. ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికారం లో లేనప్పుడు ఒక లాగా, ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడుతున్నాడు. అధికారం లో లేనప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నో సార్లు దుర్భాషలు ఆడాడు. తాట తీస్తాను అంటూ బెదిరింపులు చేసాడు. చెప్పు చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించాడు. అలాంటి వ్యక్తి నేడు ఈరోజు రప్పా రప్పా అనే డైలాగ్ పై ఇంతలా స్పందించడం హాస్యాస్పదం అని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ గుర్తు చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా.
వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు
కూటమి ప్రభుత్వం మరో 15-20 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/QlSynqQ0v1
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2025