Drishyam 3 : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ‘దృశ్యం'(Drishyam Movie) మూవీ సిరీస్ కి థ్రిల్లర్ జానర్ లో ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముందుగా మలయాళం లో మోహన్ లాల్(Mohanlal) హీరో గా ఈ ‘దృశ్యం’ చిత్రం తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్(Jeethu Joseph) దర్శకత్వం వహించాడు. ఇదే చిత్రాన్ని ఆ తర్వాత తెలుగు లో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) రీమేక్ చేసి మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు శ్రీప్రియ అనే మహిళా దర్శకురాలు దర్శకత్వం వహించింది. ఇక తర్వాత హిందీ లో అజయ్ దేవగన్(Ajay Devgan), తమిళం లో కమల్ హాసన్(Kamal Haasan) రీమేక్స్ చేసి భారీ హిట్స్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘దృశ్యం 2’ తెరకెక్కింది. కరోనా లాక్ డౌన్ సమయం లో మోహన్ లాల్ మలయాళం వెర్షన్ ని, అదే విధంగా వెంకటేష్ తెలుగు వెర్షన్ ని నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు.
ఈ రెండు చిత్రాలకు అమెజాన్ ప్రైమ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో విడుదల చేసుంటే సంచలన విజయం సాధించేవని అంతా అనుకున్నారు. ఈ చిత్రం ఓటీటీ లో విడుదలైన కొన్నాళ్ళకు హిందీ లో అజయ్ దేవగన్ రీమేక్ చేసిన ‘దృశ్యం 2’ చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. థియేటర్స్ లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా హిందీ లో నెట్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ని చూసి ఎంతటి అద్భుతమైన ఛాన్స్ ని మిస్ చేసుకున్నామో ‘దృశ్యం 2’ ని థియేటర్స్ లో విడుదల చేయకుండా అంటూ మోహన్ లాల్, వెంకటేష్ అభిమానులు బాధపడ్డారు.
అందుకే ఈసారి ‘దృశ్యం 3’ ని ఎంతో గ్రాండ్ గా నిర్మించాలని ఫిక్స్ అయిపోయారు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసాడట. త్వరలోనే తెలుగు, హిందీ,మలయాళం లో ఏకకాలం లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఒకేసారి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే దృశ్యం 2 తెలుగు, మలయాళం వెర్షన్స్ ఓటీటీ లో విడుదల అయ్యాయి కాబట్టి, ఇవి జనాలకు ఎంత మేరకు రీచ్ అయ్యి ఉంటాయి?, దృశ్యం 3 నిలదొక్కుకోవడం ఈ రెండు భాషల్లో కష్టమేనా వంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయం లో కాకుండా,కాస్త నిర్మాత ఓపిక చేసుకొని లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత థియేటర్స్ లో విడుదల చేసి ఉండుంటే వేరే లెవెల్ లో ఉండేవని అంటున్నారు విశ్లేషకులు.
Jeethu Joseph has nearly completed the script for #Drishyam3. The same storyline will be adapted with cultural tweaks for the Telugu and Hindi versions. The makers are planning a simultaneous release in all languages. pic.twitter.com/MYQ5RD1wcy
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 23, 2025