
Ustad Bhagat Singh Shooting: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా ఖరారు అయ్యి చాలా కాలమే అయ్యింది.ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతలా అయితే ఎదురు చూసారో,హరీష్ శంకర్ కూడా ఆయన డేట్స్ కోసం అంతే ఎదురు చూసారు.సుమారుగా మూడేళ్ళ నుండి ఎదురు చూస్తూ వచ్చిన హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డేట్స్ ఇచ్చేసాడు.ఏప్రిల్ 5 వ తారీఖు నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి జోడిగా కుర్ర హీరోయిన్ శ్రీలీల ఖరారు అయ్యినట్టు సమాచారం.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టుల టెస్ట్ లుక్ షూటింగ్ గత కొద్దీ రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది.పవన్ కళ్యాణ్ మరియు శ్రీలీల జోడి మీద కూడా టెస్ట్ లుక్ జరిగి చాలా రోజులే అయ్యింది.అయితే నిన్న జరిగిన టెస్ట్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారిపోయాయి.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డ్రీం ప్రాజెక్ట్ మొత్తానికి కార్యరూపం దాలుస్తున్నందుకు వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన తేరి చిత్రం స్టోరీ లైన్ తీసుకొని పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫార్మటు లో మార్చి కథని సిద్ధం చేశారట.ఫ్యాన్స్ కి ప్రతీ ఫ్రేమ్ పండగ చేసుకునే విధంగా ఉండేట్టు డైరెక్టర్ హరీష్ శంకర్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు అధికారికంగా తెలియజెయ్యనున్నారు.