
Nagababu- Bharadwaja Thammareddy: టాలీవుడ్ లో అటెన్షన్ ని గ్రాబ్ చేసే దర్శక నిర్మాతలు ఈమధ్య ఎక్కువైపోయారు..మామూలు సందర్భాలలో ఇలాంటోళ్లని పట్టించుకోము కానీ, ప్రపంచం మొత్తం పొగడ్తలతో మన తెలుగు సినిమా #RRR ని ముంచెత్తుతున్న సమయం లో కూడా కొంతమంది నోటికి ఏది తోచితే అది మాట్లాడేస్తూ అటెన్షన్ ని కొట్టేస్తున్నారు.అలాంటి వారిలో ఒకడు ప్రముఖ సీనియర్ నిర్మాత ‘తమ్మారెడ్డి భరద్వాజ’.
రీసెంట్ గా ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో సెన్సేషనల్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఆయన మాట్లాడుతూ ‘#RRR మూవీ కి ఆస్కార్ కోసం మూవీ టీం మొత్తం 80 కోట్ల రూపాయిలు ఖర్చు చేసింది.ఆ 80 కోట్లు ఎదో నాకు ఇస్తే, 8 మీడియం బడ్జెట్ సినిమాలు తీసి మీ మొహం మీద కొడుతాము’ అంటూ చెప్పుకొచ్చాడు.ఎంతో పొగరుతో ఆయన చేసిన ఈ కామెంట్స్ పై తెలుగు సినీ పరిశ్రమ మొత్తం విరుచుకుపడుతుంది.
ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో మెగా బ్రదర్ నాగ బాబు స్పందన చాలా ఘాటుగా ఉంటుంది.తమ్మారెడ్డి భరద్వాజ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడే రేంజ్ కౌంటర్ ఇచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం’ అని ఘాటుగా స్పందించాడు.మళ్ళీ చివర్లో ‘#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం’ అంటూ వ్యంగ్యంగా మరో లైన్ యాడ్ చేసాడు.

కేవలం నాగబాబు మాత్రమే కాదు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా దీనిపై చాలా ఘాటుగానే స్పందించాడు.మొత్తానికి తమ్మారెడ్డి భరద్వాజ కేవలం తనపై అటెన్షన్ రావడానికి చేసిన ప్రయత్నం లో సఫలమ్.టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ పై గాండ్రిచి ఊస్తుంది.ఇలా అయినా ఫేమస్ అయ్యాను అని తృప్తి పడే మనస్తత్వం తమ్మారెడ్డి భరద్వాజ సొంతం అంటూ విశ్లేషకులు చెప్తున్నారు.