
Pawan Kalyan- Sujeeth Movie: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలను నెలకొల్పిన చిత్రం #OG..యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు గత ఏడాదే జరిగిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కోసం ఇటీవలే మూవీ యూనిట్ మొత్తం ముంబై లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించి వచ్చింది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 15 వ తారీఖు నుండి ప్రారంభం కాబోతుందట. ముందుగా పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారు, ఆ తర్వాత మే నెల నుండి పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, మరియు షెడ్యూల్స్ గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మాఫియా గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు.
ఈ చిత్రం లో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి , అనుపమ్ ఖేర్ వంటి నటులు భాగం కాబోతున్నారట, హీరోయిన్ గా శ్రీలీల నీవు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నడూ చూడని గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కోణం ని #OG ద్వారా చూపించబోతున్నాడట డైరెక్టర్ సుజీత్.ఏప్రిల్ 15 వ తారీఖున ప్రారంభం కాబొయ్యే షెడ్యూల్ విరామం లేకుండా రెండు నెలల పాటు సాగబోతుందట.

ఎలా అయినా ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట డైరెక్టర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ కూడా క్రేజీ గా ఉండబోతుందట. హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ చిత్రం కోసం పని చెయ్యబోతున్నారు. ఈ షూటింగ్ గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి.