
Mahesh Babu- Srikanth Odela: డెబ్యూ మూవీతో సత్తా చాటాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. పెద్దగా అనుభవం లేకున్నా భారీ చిత్రం తెరకెక్కించారు. పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్ కి దొరికిన మరో టాలెంటెడ్ డైరెక్టర్ అంటున్నారు. నిర్మాతలు, హీరోలు మనోడి వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా మహేష్ బాబు నుండి ఆఫర్ కొట్టేశాడనే ప్రచారం జరుగుతుంది. దసరా మూవీ చూసిన మహేష్ ఫుల్ గా ఇంప్రెస్ అయ్యారట. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభ ఆయన్ని మెప్పించిందట.
మహేష్ ఈ మేరకు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘దసరా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే చిత్రం. చాలా అద్బుతంగా ఉంది’ అంటూ ఆయన వన్ వర్డ్ రివ్యూ ఇచ్చాడు. ఈ ట్వీట్ వేయడం వెనుక మహేష్ ఆంతర్యం మరొకటి ఉందంటున్నారు. భవిష్యత్ లో శ్రీకాంత్ ఓదెలతో పనిచేసే ఆలోచన ఆయనకు ఉందట. ఇదే విషయం శ్రీకాంత్ ఓదెలతో మహేష్ మాట్లాడారట. మంచి కథ సిద్ధం చేయి… సినిమా చేద్దాం అని హామీ ఇచ్చారట.
దాంతో శ్రీకాంత్ ఓదెల ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కెరీర్ బిగినింగ్ లోనే మహేష్ తో ఆఫర్ అంటే మామూలు విషయం కాదు మరి. మహేష్ వంటి టాప్ స్టార్ తో హిట్ కొడితే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరవచ్చు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. అయితే మహేష్-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినా దానికి ఇంకా చాలా సమయం ఉంది.

ప్రస్తుతం మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ మూవీ చేస్తున్నారు. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సమ్మర్ కల్లా చిత్రీకరణ పూర్తి కానుంది. 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఇదే ఏడాది మహేష్-రాజమౌళి మూవీ పట్టాలెక్కనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కి మహేష్ కేటాయించిన సమయం రెండేళ్లు. రాజమౌళి సినిమా కాబట్టి అది మూడేళ్లు పట్టొచ్చు లేదంటే నాలుగేళ్లు పట్టొచ్చు. కాబట్టి మహేష్ ఛాన్స్ ఇచ్చినా శ్రీకాంత్ ఓదెల దాన్ని పట్టాలెక్కించడానికి చాలా సమయం పడుతుంది.