
Photo Story: తెలుగు తెరకు హీరోయిన్ల కొరత లేదు. అలనాటి తారల నుంచి ఈనాటి తారల వరకు ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరేమో ఒకే సినిమాతో పెద్ద స్టార్ గా ఎదిగినా మరికొందరు మాత్రం తమ అదృష్టాన్ని నమ్ముకుని సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఒకే సినిమాతో సినిమా పరిశ్రమను షేక్ చేసిన వారిలో కొద్ది మంది ఉంటారు. అందులో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ తీసుకొచ్చిన తారగా గుర్తింపు తెచ్చుకుంది.
ఉత్తరాది నుంచి దక్షిణాదికి తారలు రావడం కామనే. అలనాటి నటీమణుల్లో మనీషా కోయిరాలా, రవీనా టాండన్ వంటి వారు తెలుగులో తమదైన ముద్ర వేసి నిరూపించుకున్నారు. ఉత్తరాది వారు పొడుగ్గా ఉంటారు. దక్షిణాది వారు పొట్టిగా ఉంటారు. అందుకే మన హీరోయిన్లు అక్కడ రాణించలేరు. ఇక్కడ నుంచి వెళ్లిన వారిలో శ్రీదేవి, జయప్రదలు మాత్రమే హిందీలో రాణించారు. ఎందుకంటే వారు కాస్త పొడుగ్గా ఉండటంతోనే సాధ్యమైంది. నగ్మా కూడా హిందీలో రాణించాలని చూసినా కుదరలేదు.
మోడలింగ్ రంగం నుచి బుల్లితెరకు వచ్చి అక్కడ నుంచి వెండితెరకు పరిచయమైన నటి మృణాల్ ఠాకూర్. టాలీవుడ్ లో ప్రేమకథ ద్వారా పరిచయమై యువత గుండెల్లో గంటలు మోగించింది. తొలి సినిమానే హిట్ గా చేసుకుంది. ఇక్కడ ఫొటోల్లో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఆమె మృణాల్ ఠాకూరే. సీతారామం సినిమాో తెలుగులో తన తడాఖా చూపించింది. ముంబై భామ అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా నటించి మెప్పించింది. తెలుగులో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నాని హీరోగా తెరకెక్కే సినిమాలో నటించేందుకు మృణాల్ ఒకే చెప్పేసిందట. హిందీలో అక్షయ్ కుమార్ సరసన ఓ చిన్న పాత్ర చేసి తనలోని గ్లామర్ ను పరిచయం చేసింది. తెలుగులో కూడా మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తెలుగులో వరుస అవకాశాలతో మృణాల్ దూసుకుపోతోంది. ఇప్పుడు తన చిన్ననాటి ఫొటోలు నెట్టింట్లో పెట్టడంతో వైరల్ అవుతున్నాయి. మృణాల్ ఇలా ఉందా అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పుడు క్యూట్ గా ఉండటంతో ఆసక్తిగా చూస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు.