https://oktelugu.com/

Pastor praveen : పాస్టర్ ప్రవీణ్.. విజయవాడలో అంత సేపు ఏం చేశారు?

Pastor praveen : ప్రవీణ్ మృతి పై పోలీసులు ముంబరంగ దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ఆచూకీ కి సంబంధించి నాలుగు గంటల పాటు విజయవాడలో ఆచూకీ లభించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Written By: , Updated On : March 31, 2025 / 11:16 AM IST
Pastor Praveen incident

Pastor Praveen incident

Follow us on

Pastor praveen : ప్రవీణ్ మృతి పై పోలీసులు ముంబరంగ దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ఆచూకీ కి సంబంధించి నాలుగు గంటల పాటు విజయవాడలో ఆచూకీ లభించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజమండ్రి కి చేరుకోవడానికి ముందే ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ చెప్పడంతో ఈ కేసు మరోవైపు టర్న్ తీసుకుంది. అయితే విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారు అనే ప్రశ్నకు సాంకేతికపరమైన ఆధారాలను ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేకరించారు.. సిసి కెమెరాలలో ప్రతి కదలికను కూడా పోలీసులు గుర్తించారు.. దాదాపు 300 కెమెరాల పుటేజ్ లను జల్లెడ పట్టారు.. మార్చి 24న ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.. అదే రోజు మధ్యాహ్నం కోదాడలోని ఓ వైన్ షాప్ లో మద్యం సీసా కొనుగోలు చేశారు. ఇందుకోసం 650 రూపాయలు ఖర్చు చేశారు.. దానికి ఫోన్ పే(phonepe) ద్వారా డబ్బులు చెల్లించారు.. కోదాడ నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించే ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు తెలుస్తోంది. మద్యం అధికంగా తాగడంతో కంచికచర్ల – పరిటాల గ్రామాల మధ్య ఆయన అదుపుతప్పి పడిపోయారని సమాచారం. దీంతో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ వాహనం హెడ్లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయాయి.. ఆ తర్వాత ప్రవీణ్ గొల్లపూడి వెళ్లారు.. అక్కడ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ ఎంత పోయాలని సిబ్బంది అడిగితే.. ప్రవీణ్ వేళ్లు మాత్రమే చూపించారు.. 800 రూపాయల విలువైన పెట్రోల్ పోయమంటారా అని సిబ్బంది అడిగితే.. అడ్డంగా తల ఊపారు. అనుమానం వచ్చిన బంకు సిబ్బంది ఎనిమిది లీటర్లు పోయమంటారా? దానికి తల ఊపడంతో.. 8 లీటర్ల పెట్రోల్ కు 872 అయిందని చెప్పడంతో.. ప్రవీణ్ ఫోన్ పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై చర్మం కొట్టుకుపోయింది. బుల్లెట్ హెడ్లైట్ కూడా ఊడిపోయింది. ఇక అక్కడ నుంచి ప్రవీణ్ నేషనల్ హైవేపై విజయవాడలోని దుర్గ గుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీది నుంచి మహానాడు జంక్షన్ కూడలి వద్దకు చేరుకున్నారు.. అయితే మహానాడు కూడలి తర్వాత ప్రవీణ్ కదలికలు సీసీ కెమెరాలలో కనిపించలేదు.. దీంతో రామవరప్పాడు – మహానాడు జంక్షన్ కూడలి వద్ద ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు..

Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త కోణం.. మద్యం మత్తే కారణమా?

రామవరప్పాడు రింగ్ రోడ్ లో ఏం జరిగింది అంటే..

రామవరప్పాడు రింగ్ రోడ్డు కు పది మీటర్ల దూరంలోనే ఓ షోరూం కు ఎదురుగా ఉన్న నేషనల్ హైవే పై ఆయన కింద పడిపోయారు. దీంతో స్థానికులు ట్రాఫిక్ ఎస్ఐ వరకు ఈ విషయం చెప్పడంతో.. ప్రవీణ్ ను పైకి లేపి.. నేషనల్ హైవేపై ఉన్న రైయిలింగ్ పై కూర్చోబెట్టారు. అతని వాహనాన్ని ఆటు డ్రైవర్లు తోసుకుంటూ ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ప్రవీణ్ కు ముఖం కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇచ్చారు. అక్కడే ఉన్న గడ్డిలో రెయిలింగ్ పక్కనే ఉన్న పచ్చగడ్డిలో ప్రవీణ్ రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు నిద్రపోయారు.. ఇక తాగిన మైకంలో వాహనం నడపడం నేరమని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత హోటల్ నుంచి టీ తెప్పించి అతనికి ఇచ్చారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ ఏలూరు వెళ్లిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని చెబుతున్నప్పటికీ ప్రవీణ్ వినిపించుకోలేదు. ఏలూరు చేరుకున్న తర్వాత ప్రవీణ్ మరలా టానిక్ వైన్స్ లో 350 రూపాయల విలువైన మద్యం కొనుగోలు చేసి తాగినట్టు తెలుస్తోంది..

Also Read : పాస్టర్ ది హత్యా? ప్రమాదమా? ఏపీ ప్రభుత్వం సీరియస్!