https://oktelugu.com/

Star heroine : జిమ్ లో ప్రమాదానికి గురైన స్టార్ హీరోయిన్, నెలలు గడుస్తున్నా కోలుకోని పరిస్థితి, ఆందోళనలో ఫ్యాన్స్

Star heroine : ఫిట్నెస్ వ్యామోహంతో ఇబ్బందుల్లో పడింది ఓ స్టార్ హీరోయిన్. జిమ్ లో ప్రమాదానికి గురి కావడంతో గాయమైంది. ఆమె కోలుకోవడానికి మరో ఆరు నెలల సమయం కావాలట. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Written By: , Updated On : March 31, 2025 / 11:22 AM IST
Star heroine

Star heroine

Follow us on

Star heroine : హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తేనే అవకాశాలు దక్కుతాయి. గ్లామర్ ప్రపంచంలో రాణించాలి అంటే ఇంపైన శరీరాకృతి అవసరం. దాని కోసం హీరోయిన్స్ చాలా కష్టపడతారు. తిండి విషయంలో త్యాగాలు చేస్తారు. యోగ, వ్యాయామం దినచర్యలో భాగంగా ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తారు. అయితే కొందరు అందం కోసం మితిమీరిన వ్యాయామం, డైటింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఇప్పుడు అలానే అయ్యింది. రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్. ఆమె ఫిట్ అండ్ స్లిమ్ బాడీ కోసం పరితపిస్తూ ఉంటుంది. పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఇప్పటికీ జీరో సైజ్ మైంటైన్ చేస్తుంది.

Also Read : సినిమాల్లో చాలా పద్ధతిగా.. కానీ నెట్టింట మాత్రం గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..

ఇటీవల రకుల్ ప్రీత్ జిమ్ లో గాయానికి గురైందట. 80 కేజీల డెడ్ లిఫ్ట్ ఎత్తే క్రమంలో ఆమె వెన్నెముక దెబ్బతింది అట. అప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ బరువు ఎత్తే ప్రయత్నం చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంది. మరో ఆరు నెలలు గడిస్తే కానీ కోలుకునే పరిస్థితి లేదట. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించింది. శరీరం మనకు ఇచ్చే సంకేతాలను గుర్తించాలి. అందుకు అనుగుణంగా నడుచుకోవాలని రకుల్ అన్నారు. తాను అనవసరంగా బరువు ఎత్తానని పరోక్షంగా బాధపడ్డారు.

కాగా 2024లో రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీ ని వివాహం చేసుకుంది. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటించింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ కి దూరమైంది. రకుల్ ప్రీత్ నటించిన చివరి తెలుగు చిత్రాలు చెక్, కొండపొలం. ఇవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో రకుల్ ప్రీత్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. అలాగే రకుల్ బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. హిందీ చిత్రాలు ఎక్కువగా చేస్తుంది.

రకుల్ ప్రస్తుతం భారతీయుడు 3, దే దే ప్యార్ దే 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది. భారతీయుడు 3 ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నాడు. దే దే ప్యార్ దే 2 చిత్రీకరణ దశలో ఉంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటిస్తున్నాడు.

Also Read : ప్రేమ, పెళ్లి…భర్త మరో హీరోయిన్ తో ఎఫైర్.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటి..