https://oktelugu.com/

Chikoti Praveen Arrested: థాయ్ రాజా థాయ్; ఇక్కడ తప్పించుకున్నా: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్

చికోటి ప్రవీణ్ మొదటి నుంచి ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో సిద్ధహస్తుడు. గతంలో టాలీవుడ్ నటిమణి ఈషా రెబ్బతో కలిసి శ్రీలంక, నేపాల్ దేశాల్లో కేసినో నిర్వహించేందుకు ఆమెను ప్రచారకర్తగా ఎంచుకున్నాడు. ఇందుకు ఆమెకు భారీగానే ముట్ట చెప్పాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రవీణ్ కు దగ్గర సహితురాలు.

Written By:
  • Rocky
  • , Updated On : May 1, 2023 6:35 pm
    Follow us on

    Chikoti Praveen Arrested: చికోటి ప్రవీణ్ తెలుసు కదా.. ఆ మధ్య కేసినో, వివిధ అక్రమ కార్యకలాపాల ద్వారా వెలుగులోకి వచ్చాడు. భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్సిపి నాయకులతో ఉన్న సంబంధాల వల్ల ఏకంగా ఒక కేసినో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. శంషాబాద్ శివారులో తన ఫామ్ హౌస్ లో నిబంధనలకు విరుద్ధంగా జంతువులను కూడా పెంచుకోవడం మొదలుపెట్టాడు. పైగా ఆ మధ్య అతడిని అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ఇది ప్రభుత్వానికి పెద్ద ముప్పులాగా పరిణమించడంతో కేసు గాయబ్ అయింది. అయితే తెలంగాణలో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేసి ఏపీ వెళ్ళాడు. అక్కడ కొడాలి నాని, వల్లభనేని వంశీ సహకారంతో గుడివాడలో ఏకంగా పెద్ద కేసనో ఏర్పాటు చేశాడు. వివిధ దేశాల నుంచి యువతులను తీసుకొచ్చి భారీ ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహించాడు. అయితే అతడు జాబితాలో టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారని సమాచారం. అయితే కొద్ది రోజుల నుంచి స్తబ్దంగా ఉంటున్న ప్రవీణ్ వ్యవహారం ఇప్పుడు తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

    థాయిలాండ్ లో అరెస్టు

    భూతల కేసినో స్వర్గంగా పేరు పొందిన థాయిలాండ్ లో తెలుగు వాళ్లతో కలిసి చీకోటి ప్రవీణ్ జూదం నిర్వహిస్తున్నాడు. పటాయ ప్రాంతంలో హోటల్ లో 90 మంది భారతీయులతో కలిసి భారీ ఎత్తున జూదం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారంలో 16 మంది యువతులు కూడా ఉన్నారు. అయితే ఈ హోటల్ కేంద్రంగా భారీ ఎత్తున జూదం జరుగుతోంది అని తెలుసుకున్న థాయిలాండ్ పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి 20 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్, భారత కరెన్సీ, స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో కండోమ్స్, డ్రగ్స్ ప్యాకెట్లు, సిరంజిలను కూడా స్వాధీనం చేసుకుందామని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

    గతంలో నేపాల్

    చికోటి ప్రవీణ్ మొదటి నుంచి ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో సిద్ధహస్తుడు. గతంలో టాలీవుడ్ నటిమణి ఈషా రెబ్బతో కలిసి శ్రీలంక, నేపాల్ దేశాల్లో కేసినో నిర్వహించేందుకు ఆమెను ప్రచారకర్తగా ఎంచుకున్నాడు. ఇందుకు ఆమెకు భారీగానే ముట్ట చెప్పాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రవీణ్ కు దగ్గర సహితురాలు. ఈమెను కూడా తన జీవితం వ్యాపారం సాగేందుకు వినియోగించుకున్నాడు.. ఇక ఇదే తరహా విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టాడు. పలు పబ్ లలో జూదం నిర్వహించేవాడు. తెలంగాణ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆడింది ఆట పాడింది పాటగా మారింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి మంత్రులు ఇతడు ఇంట్లో జరిగే వేడుకలకు కూడా హాజరయ్యేవారు. ఆ స్థాయిలో ఉండేది ఇతడి పలుకుబడి. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో ఇతడి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రవీణ్ కార్యకలాపాలు దాదాపుగా ముగిశాయి.. ఇప్పుడు తాజాగా థాయిలాండ్ లో ప్రవీణ్ అరెస్ట్ కావడంతో మరొకసారి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అతడి పేరు చర్చనీయాంశమైంది. అయితే అక్కడి పోలీసులు తెలుగువారిని అరెస్టు చేసిన నేపథ్యంలో వారు ఎవరు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రవీణ్ తో కేసినో ఆడుతున్నారు? వీరి వెనుక ఉన్నది ఎవరు? అనే కోణాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.