Fish : చేపల వేట అంటే చాలామందికి ఇష్టం. జాలర్లు, మత్స్యకారులు మినహాయిస్తే.. కొంతమంది చేపలు పట్టడంలో సిద్ధహస్తులుగా ఉంటారు. అప్పుడప్పుడు సమీపంలో ఉన్న చెరువులు, నదులు, కుంటల వద్దకు వెళుతూ చేపలు పడుతుంటారు. కొందరు గాలాలు, ఇంకొందరు వలలు వేస్తూ చేపలను వేటాడుతుంటారు. అయితే అలా చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతడు చనిపోవడానికి ప్రధాన కారణం నీటిలో మునిగడమో.. మరోటో కాదు.. అతడు చనిపోవడానికి చేపనే ప్రధాన కారణం.. అలాగని అతడిని చంపింది సొరచేపో.. ఇంకొకటో కాదు.
Also Read : మత్స్యకారులను వరించిన అదృష్టం.. కాసుల వర్షం కురిపించిన మీనం.. ఇంతకీ ఆ చేప కథేంటంటే!
పట్టుకున్న చేప ప్రాణం తీసింది
చెన్నైలో మణికందన్ అనే యువకుడు ఉన్నాడు. ఇక్కడికి చేపల వేట అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా చేపలు పడుతుంటాడు. అలా చేపలు పట్టడం వల్ల తనకు సమయం గడిచిపోవడంతో పాటు.. నచ్చిన చేపలను ఆహారంగా తినే అవకాశం కలుగుతుంది. ఆ వ్యక్తి చెన్నైలోని కీలావాలం అనే ప్రాంతంలోని ఓ చేపల చెరువులో చేపలను పట్టుకున్నాడు. ఒక చేపను చేతితో పట్టుకున్నాడు. మరొక చేపను నోట కరచుకొని… ఒడ్డుకు ఈదుకుంటూ వస్తున్నాడు. అయితే నోట కరుచుకున్న చేప నేరుగా ఆయన గొంతులోకి వెళ్ళింది. ఆ చేప అక్కడే చిక్కుకుపోవడంతో మణికందన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అతడిని గమనించిన స్థానికులు ఒడ్డుకు చేర్చేలోపే.. శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయాడు. మణికందన్ మింగిన చేప గొంతుకు అడ్డం పడటంతో శ్వాస ఆడటం కష్టమైంది. ఫలితంగా అతడు నీటిలో విలవిలాడిపోయాడు. గుర్తించిన స్థానికులు అతన్ని ఒడ్డుకు తీసుకువస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు..” అతడు చేపలు పట్టాడు. చెరువులో లోతుకు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా..ఒక చేపను నోట్లో పెట్టుకున్నాడు. మరో చేపను ఒక చేత్తో పట్టుకున్నాడు. అలానే ఈదుకుంటూ వస్తుండగా.. ఆ చేప అటూ ఇటూ కదులుతుండగా.. అమాంతం నోటితో అదిమి పట్టుకున్నాడు. అది కాస్త నోట్లోకి వెళ్లిపోయింది. గొంతుకు అడ్డం పడటంతో శ్వాస ఆడలేదు. దీంతో అతడు చనిపోయాడు. అతడు కనుక ఆ చేపను నోటితో కరుచుకోకుండా ఉండకుండా అక్కడే వదిలేస్తే బాగుండేది. కానీ అత్యాశ వల్ల ఆ చేపను నోటితో కరుచుకుంటూ వచ్చాడు. చివరికి అది అతని ప్రాణాలు తీసింది.. గొంతులో చేప ఇరుక్కుపోయి.. శ్వాస సరిగా ఆడక అతడు పడిన ఇబ్బంది వర్ణనాతీతమని” స్థానికులు చెబుతున్నారు. మణికందన్ చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రాంతం అత్యంత లోతుగా ఉంది. అయితే అక్కడ చేపలు లభించిన తర్వాత అతడు వెంటనే ఒడ్డుకు రావాలని భావించాడు. పట్టుకున్న చేపలలో ఒక దానిని అక్కడే వదిలేసి ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ రెండు చేపలను కూడా తీసుకురావాలనే అతని అత్యాశ ప్రాణాలు తీసింది.
Also Read : ఫస్ట్ టైం కెమెరాకు చిక్కిన ‘నల్ల సముద్ర రాక్షసుడు’.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న అరుదైన వీడియో