‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శనిదేవుడి ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయవలసిన వారు కొన్ని రోజులపాటు వాయిదా వేసుకోవాలి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో మాటలను అదుపులో ఉంచుకోవాలి. అధికారులతో వేధింపులు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు కొన్ని పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉండదు. లేకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటారు. అయితే మరికొందరు కొన్ని పనుల కారణంగా ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో గుర్తింపును పొందుతారు. దీంతో జీతం పెరిగే అవకాశం ఉంది. మరికొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థుల బెడద ఎదుర్కునే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఆందోళనతో ఉంటారు. తల్లిదండ్రుల మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. దీంతో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇవి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు అనుకోకుండా లాభాలు వస్తాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలవడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఇంటి ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పనితీరు కారణంగా ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండే అవకాశం. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్థిరాస్తి విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామిగా విభేదాలు ఉండే అవకాశం. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూలమైన సమయం. ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. స్నేహితులకు ధన సహాయం చేస్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇవి లాభాలనే తీసుకొస్తాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ సమయంలో తల్లిదండ్రుల సహాయం అవసరం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. దీంతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారులకు వివిధ మార్గాల నుంచి లాభాలు వస్తాయి. అనుకోకుండా ఖర్చులు పెరగడంతో కాస్త ఆందోళనగా ఉంటుంది. అయితే అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు ఉండలు ఉన్నాయి. అయితే ఉద్యోగులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అయితే కొన్ని వివాద సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఏ పని చేపట్టిన ఈ రోజు విజయం సాధిస్తారు. బంధువులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.