NTR and Prashanth Neel : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వరుసగా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీ హిట్లను సంపాదించుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకుంటారు. మరి ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఆయన ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా వల్ల భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేయడంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకప్పుడు చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. రాజమౌళి (Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ తో నాలుగు సినిమాలను చేశాడు. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. కానీ వీటిలో ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా మారకపోవడం విశేషం…ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఏ ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ గా మారలేకపోయింది.
ఇక రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు సైతం ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ని అందించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్స్ ని కూడా అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
మరిలాంటి క్రమంలోనే రాజమౌళికే ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టడం సాధ్యపడలేదు. మరి ప్రశాంత్ నీల్ వల్ల అవుతుందా? అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ అయితే ఉంది బీ,సీ సెంటర్లో ఆయన సినిమాని రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఉన్నారు. అయినప్పటికి ఆయన సినిమాలు ఇండస్ట్రీ హిట్ ఎందుకు ఎందుకు సాధించడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ సినిమా వల్ల అయిన ఆయనకి ఇండస్ట్రీ హిట్ దక్కుతుందా? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎవ్వరు ఊహించని రీతిలో చూపించి భారీ ఎలివేషన్స్ ను ఇస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేస్తే తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా అయితే మారదు. చూడాలి మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!