
Charan – NTR : నిన్న ట్విట్టర్ వేదిక కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హీరో అల్లు అర్జున్ బర్త్ డే కాగా రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మరో హీరో అక్కినేని అఖిల్ కి కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ రెండు పోస్ట్స్ లో ఓ డిఫరెన్స్ ఉంది. అల్లు అర్జున్ ని విష్ చేశారు కానీ ఫోటో జోడించలేదు. అఖిల్ బర్త్ డే విషెస్ పోస్ట్ లో మాత్రం ఆయనతో దిగిన ఒక ఫోటోను చరణ్ పంచుకోవడం జరిగింది. ఇది చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రామ్ చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ విష్ చేయలేదు. బర్త్ డే పార్టీకి కూడా రాలేదు.
చరణ్ కనీసం విష్ చేశాడు. బన్నీ మాత్రం చరణ్ బర్త్ కి విషెస్ కూడా చెప్పలేదని చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఎద్దేవా చేస్తున్నారు. చరణ్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వాడివేడి చర్చ నడుస్తుండగా… ఎన్టీఆర్ ఎంట్రీ వివాదాన్ని పెద్దది చేసింది. ఎన్టీఆర్- అల్లు అర్జున్ ట్విట్టర్ చాట్… చరణ్ ఫ్యాన్స్ ని అసహనానికి గురి చేసింది. హ్యాపీ బర్త్ డే బావా? అని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా… థాంక్యూ నీకు హగ్స్ అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. హగ్స్ మాత్రమేనా పార్టీలేదా పుష్పా? అని ఎన్టీఆర్ కామెంట్ చేశాడు. దానికి సమాధానంగా… ‘వస్తున్నా’ అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.
ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. చరణ్-అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వాదన ఉంది. ఇటీవల ఎన్టీఆర్ తో చరణ్ కి దూరం పెరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రెడిట్ విషయంలో వీరిద్దరికీ తెలియకుండానే ఒకరిపై మరొకరికి చిన్న వ్యతిరేకత మొదలైందనే అనుమానాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా చరణ్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఎన్టీఆర్ కొన్ని కారణాలతో నొచ్చుకొని దూరంగా ఉంటున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో చరణ్ కి దూరమైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి దగ్గరయ్యాడని. చరణ్ ని ఉడికించేలా ఇద్దరూ ట్విట్టర్లో చాట్ చేశారనే ఓ వాదన తెరపైకి వచ్చింది. మార్చి 27న జరిగిన రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఇండస్ట్రీ మొత్తం హాజరయ్యారు. హైదరాబాద్ లో ఉండి కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ కి దూరమయ్యాడని, ఒకప్పటి బాండింగ్ వాళ్ళ మధ్య లేదంటున్నారు. కాగా రామ్ చరణ్ కి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. థాంక్యూ డియరెస్ట్ బ్రదర్ అంటూ… కామెంట్ చేశారు. ఈ క్రమంలో మెగా హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ అపోహలు మాత్రమే అని పలువురు కొట్టిపారేస్తున్నారు.