
Samanth Ruthprabhu Secrets : సమంత డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. విషయం ఏదైనా కుండబద్దలు కొడుతుంది. దాపరికాలు, డొంకతిరుగుడు వ్యవహారం ఉండదు. ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధం కాగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. శాకుంతలం పాత్ర తనను ఎంతగానో థ్రిల్ కి గురి చేసిందని సమంత అన్నారు. యువరాణిలా నటించడం గొప్ప అనుభూతి. చిన్నప్పటి నుండి నేను డిస్నీ పిక్చర్స్ చూస్తూ పెరిగాను. బోర్ కొడితే వాటినే చూసేదాన్ని. శాకుంతలం పాత్ర ఒక ప్రేక్షకుడిలా నేను ఆస్వాదించాను… అన్నారు.
శాకుంతలం పాత్ర చేయడానికి మొదట నేను భయపడ్డాను. అయితే కొన్నాళ్లుగా నా జీవితంలో అనేక సవాళ్లు చోటు చేసుకున్నాయి. వాటికి నేను అలవాటు పడ్డాను. శాకుంతలం చిత్రాన్ని ఒక సవాల్ గా స్వీకరించాను, అన్నారు. అల్లు అర్హ గురించి సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్హ ఇండిపెండెంట్ గర్ల్. తన కెరీర్ విషయంలో అల్లు అర్జున్ జోక్యం అవసరం లేదు. తన నిర్ణయాలు తానూ తీసుకోగలదు. శాకుంతలం మూవీలో అర్హ పాత్ర గొప్పగా ఉంటుంది. అందుకే మహిళలు, చిన్న పిల్లలు శాకుంతలం మూవీ చూడాలని సమంత అన్నారు.

మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. మీ ఫీలింగ్ ఏంటని అడగ్గా సమంత షాకింగ్ ఆన్సర్ చెప్పారు. నేను పాన్ ఇండియా స్టార్ అని నా కుక్కలు ఎవరైనా చెబితే బాగుండు. ఎందుకంటే నేను ఇంకా వాటి మలం ఎత్తేస్తున్నానని సెటైరికల్ ఆన్సర్ చెప్పారు. నేను సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతాను. సాయంత్రం ఆరు గంటల వరకే నేను స్టార్. తర్వాత నేను మామూలు మహిళ మాదిరి మారిపోతాను… అని చెప్పుకొచ్చారు.
శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. దర్శకుడు గుణశేఖర్ ఈ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించారు. మోహన్ దేవ్ సమంతకు జంటగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఓ కీలక రోల్ చేశారు. మరోవైపు సమంత సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.