Nayanthara: సౌత్ ఇండియా లో ఏడాదికి ఎంత మంది స్టార్ హీరోయిన్లు వస్తున్నప్పటికీ లేదు సూపర్ స్టార్ ఎవరు అంటే మన అందరికి గుర్తుకు వచ్చే పేరు నయనతార..కేవలం హీరోల పక్కన డ్యాన్స్ వేసే హీరోయిన్ టైపు కాదు నయనతార..ఆమె ఒక సినిమా ఒప్పుకుంది అంటే కచ్చితంగా కథాబలం మరియు తన పాత్ర శక్తివంతంగా ఉంటేనే ఆమె ఒక సినిమా చెయ్యడానికి సంతకం చేస్తుంది..అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే..అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు నయనతార మేకర్స్ కి ఒక బెస్ట్ ఆప్షన్.

ఆమె చేసిన ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసాయి..ఇక ఈ ఏడాది తన ప్రియుడు సతీష్ విఘ్నేష్ ని పెళ్లాడిన నయనతార అప్పుడే ఇద్దరు పిల్లలకు జన్మని కూడా ఇచ్చేసింది..ఇదంతా పక్కన పెడితే నయనతార లోని ఎవ్వరికి తెలియని కోణం ఆమె అత్తగారు ఇటీవలే మీడియా కి చెప్పగా, అది ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.
ఇక అసలు విషయానికి నయనతార ఇంట్లో 8 మంది పని మనుషులు ఉంటారట..ఎవరికీ ఏ కష్టం రాకుండా తన సొంత మనిషిలాగ చూసుకోవడం నయనతార కి అలవాటు అట..ఇటీవలే ఒక పని మనిషిని అప్పులోళ్లు పీడిస్తుంటే అది గమనించిన నయనతార, పని మనిషి తీసుకున్న ఆ నాలుగు లక్షల రూపాయిల అప్పుని చెల్లించి ఆమె సమస్య ని పరిష్కరించింది అంటూ నయనతార అత్త చెప్పుకొచ్చింది..నయనతార ఇలాంటి సహాయాలు ఎన్నో చేసిందని..కానీ ఆమె ఎవరికీ చెప్పుకోదు, చాలా సీక్రెట్ గా ఉంచుతుంది, నా కోడలు బంగారం లాంటిది అంటూ నయనతార అత్త పొగడ్తలతో ముంచెత్తింది.

ఆమె మాట్లాడిన మాటలను షేర్ చేస్తూ నయనతార అభిమానులు సోషల్ మీడియా లో తెగ మురిసిపోతున్నారు ..ఇక నయనతార ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా తర్వాత ఆమె కొంతకాలం నటనకు విరామం ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది..ఇందులో ఎంత వరుకు నిజం ఉందో చూడాలి.