Bigg Boss 6 Telugu Nominations 13th Week: ఈరోజు నామినేషన్స్ గత రెండు వారాలతో పోలిస్తే చాలా వాడివేడిగా సాగింది..బిగ్ బాస్ హౌస్ ని ఇంత యుద్ధ వాతావరణం లో చూసి చాల రోజులు అయ్యింది..మిగిలిన కంటెస్టెంట్స్ నామినేషన్స్ కాస్త కూల్ గా సాగినప్పటికీ రేవంత్ – ఫైమా మరియు రేవంత్ – ఆదిరెడ్డి నామినేషన్స్ తీవ్రమైన వాగ్వివాదాల నడుమ సాగింది..మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతివారం లో లాగానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ లో రేవంత్ ని మెజారిటీ ఇంటి సభ్యులు టార్గెట్ చేసారు.

ఇక ఈ వారం రేవంత్ తో పాటుగా రోహిత్ , ఆది రెడ్డి, ఫైమా , కీర్తి మరియు శ్రీ సత్య ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు..వీరిలో ఇంటి నుండి బయటకి వెళ్తారో చూడాలి..ఎలిమినేషన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవాళ్ళే వెళ్లిపోతుండడం తో ఈ వారం కూడా అలాంటి ఎలిమినేషన్ ఉండబోతుందా లేదా అనేది చూడాలి.
ఇక ఈరోజు నామినేషన్స్ లో ఫైమా మరియు ఆది రెడ్డి రేవంత్ ని చాలా తీవ్రంగా టార్గెట్ చేసారు..అతనిపై జనాల్లో చెడు అభిప్రాయం కలగచెయ్యడానికి గట్టిగానే కష్టపడ్డారు..ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో కీర్తి టాపిక్ ని తీసుకొచ్చి రేవంత్ ని ప్రాజెక్ట్ చెయ్యడానికి ప్రయత్నం చేసారు..కీర్తి మొదటి రోజు నుండి అదే సెంటిమెంటల్ ఎమోషన్ ని క్యారీ చేస్తూ వచ్చింది..అందుకే ఇక్కడకి వచ్చిన వాళ్ళందరూ కీర్తి పై అంత సానుభూతి చూపించారు..గత మూడు వారాలుగా ఆ అమ్మాయి ఏమి ఆడలేదు..వేలు విరగ్గొట్టుకొని కూడా ఆడదానికి ప్రయత్నం చేసింది.

అది జనాల్లోకి బాగా వెళ్ళింది అంటూ ఆది రెడ్డి మరియు ఫైమా తో ముందు రోజు చర్చ చేస్తాడు రేవంత్..ఇదే విషయాన్నీ ఈరోజు ఫైమా మరియు ఆది రెడ్డి పట్టుకొచ్చి ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతున్నావ్..నువ్వు చెప్పినదాని మీద నువ్వే నిలబడట్లేదు అంటూ అతనిని జనాల్లో ప్రాజెక్ట్ చేసాడు..మరి ఇది రేవంత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.