
Taraka Ratna Marriege : గత 23 రోజుల నుండి మృత్యువుతో పోరాడిన నందమూరి తారక రత్న నేడు తన తుదిశ్వాస ని విడిచేసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.కుప్పం లో లోకేష్ పాదయాత్ర ప్రారంభం లో పాల్గొన్న తారకరత్న కి అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ఆ తర్వాత వెంటనే ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఎంతో అనుభవం ఉన్న వైద్యులతో చికిత్స చేయించినా కానీ ఫలితం లేకుండా పొయ్యింది.తారకరత్న సినీ హీరో గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, ఒక వ్యక్తి గా ఎంతో ఉన్నత ప్రమాణాలతో బ్రతికి అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడట.
ఆపదలో ఉన్న ఏ వ్యక్తి కైనా సహాయం చెయ్యడం లో ముందు ఉండే తారకరత్న లాంటి మహా మనిషి నేడు మన మధ్య లేకపోవడం మన అందరం చేసుకున్న దురదృష్టం.ఇది ఇలా ఉండగా తారకరత్న గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మేము మీ ముందు ఉంచబోతున్నాము.
తారక రత్న ప్రముఖ రాజకీయ నాయకుడు విజయ్ సాయి రెడ్డి చెల్లెలు కూతురైన అలేఖ్య రెడ్డి ని 2012 వ సంవత్సరం ఆగష్టు 2 వ తారీఖున పెళ్లాడాడు.ఆయన పెళ్లి నందమూరి కుటుంబం లో ఎవరికీ కూడా ఇష్టం లేదు.ఎందుకంటే అలేఖ్య రెడ్డి కి అప్పటికే ఒక పెళ్లి జరిగి విడాకులు అయ్యి ఉండడమే.కానీ ప్రేమించాడు కాబట్టి తారకరత్న కుటుంబాన్ని ఎదిరించి ఎవరికీ తెలియకుండా సంఘీ టెంపుల్ లో వివాహం చేసుకున్నాడు.రహస్యం గా చేసుకున్న వివాహం కావడం తో కేవలం కొంతమంది మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు.అలా అలేఖ్య రెడ్డి ని పెళ్లాడనిన తర్వాత నాలుగేళ్ళ పాటు నందమూరి కుటుంబానికి దూరమైనా తారకరత్న ని మళ్ళీ దగ్గరకి తీసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ.ఆయనకీ తన అబ్బాయి తారకరత్న అంటే ఎంతో ప్రేమ.
అతనికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన క్షణం నుండి నేటి వరకు తారకరత్న యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటే బెంగళూరు లోనే ఇన్ని రోజులు ఉంటూ వచ్చాడు.అంతలా ప్రేమించే అబ్బాయి చనిపోవడం బాలయ్య కి ఎంత శోకం ఉంటుందో ఒక్క మాటలో చెప్పలేము.తారకరత్న ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ఆ దేవుడికి ప్రరార్థన చేద్దాము.