
Nara Lokesh Emotional- Tarakaratna: నందమూరి కుటుంబం హరికృష్ణ , జానకిరామ్ మరణాలని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్న ఈ తరుణంలో మరో కుటుంబ సభ్యుడు నందమూరి తారకరత్న మరణించడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.తారకరత్న కి ఎలాంటి అనారోగ్యం లేదు,ఆరోగ్యం పరంగా ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు.అతని వయస్సు కూడా కేవలం 39 సంవత్సరాలు మాత్రమే.ఇంత చిన్న వయస్సులో ఆయనకీ అకస్మాత్తుగా గుండెపోటు రావడం, 23 రోజుల పాటిగా ICU లో చావుతో పోరాడి నిన్న ప్రాణాలను వదలడం వంటివి ఎంతో విచారకరమైన సంఘటన గా చెప్పుకోవచ్చు.
ఉజ్వల రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఇంతలోపే ఇలా జరగడం వంటివి అభిమానులు కలలో కూడా ఊహించనిది.నందమూరి బాలకృష్ణ కి పాపం గత 23 రోజుల నుండి కంటిమీద కునుకు కూడా లేదు.ప్రతీ రోజు తారకరత్న ఆరోగ్యం గురించి డాక్టర్లతో ఆరాలు తీస్తూ అతనికి మెరుగైన వైద్యం కోసం ఎన్ని ప్రయత్నాలు అయితే చెయ్యాలో అన్నీ చేసాడు, కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది.

ఇక నారా లోకేష్ బాధ వర్ణనాతీతం.విజయవంతంగా ‘యువ గళం’ పాదయాత్ర చేస్తున్న లోకేష్ , తారకరత్న త్వరగానే కోలుకుంటాడనే బలమైన విశ్వాసం తో ఉండేవాడు.కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేకపొయ్యాడు.ఆయన మాట్లాడుతూ ‘ఒక గొప్ప కార్యక్రమం కోసం నేను తలపెట్టిన యువగలం పాదయాత్ర రోజే తారకరత్న అస్వస్థతకి గురవ్వడం నన్ను ఎంతో దిగ్బ్రాంతికి గురి చేసింది.23 రోజుల నుండి ఆయన ప్రాణాలతో పోరాడుతున్నాడు.క్షేమంగా కోలుకుంటాడని భావించిన నాకు తారక రత్న మరణ వార్త జీర్ణించుకోవడానికి ఎంతో కష్టం అవుతుంది.బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు,నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’ అంటూ నారాలోకేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.