Naga Shaurya Rangabali
Naga Shaurya Rangabali: హీరో నాగ శౌర్య కొత్త మూవీ ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ షేర్ చేశారు. నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి భిన్నమైన సబ్జెక్టు తో నాగ శౌర్యను ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్ర టైటిల్ గా ‘రంగబలి’ ని నిర్ణయించారు. రంగబలి వినడానికి చాలా కొత్తగా ఉంది. అయితే సినిమా కాన్సెప్ట్ ప్రకారం ఇదొక ఊరి పేరు. రంగబలి లో జరిగిన కథే ఈ చిత్రం. టైటిల్ పోస్టర్ చూస్తే ఓ ఊరి కూడలిని పోలిన నేపథ్యం మనం గమనించవచ్చు.
రంగబలి పీరియాడిక్ విలేజ్ డ్రామా కూడా అయ్యే అవకాశం ఉంది. టైటిల్ వినూత్నంగా ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. టైటిల్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంలో సుధాకర్ చెరుకూరి రంగబలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నటుడిగా కష్టపడుతున్నా నాగ శౌర్యకు ఫలితం దక్కడం లేదు. ఛలో మూవీతో సూపర్ హిట్ కొట్టిన నాగ శౌర్య ఆ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేయలేకపోయారు. చెప్పాలంటే ఆయన క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. విజయం కోసం అనేక ప్రయోగాలు చేశారు. లవ్,రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో పాటు స్పోర్ట్స్ డ్రామాలు చేశారు. మాస్ ఇమేజ్ కోసం అశ్వద్ధామ వంటి మూవీ చేశారు. ఏవీ ఫలితం ఇవ్వలేదు. ఈ మధ్య విడుదలైన ఆయన సినిమాలకు కనీస వసూళ్లు రాలేదు.
Naga Shaurya Rangabali
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి డిజాస్టర్ అయ్యింది. రంగబలి చిత్రంతో పాటు ధమాకా దర్శకుడితో నాగ శౌర్య ఒక చిత్రం చేస్తున్నారు. తమ సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. త్రినాధరావు నక్కిన దర్శకుడికి ఉషా ముల్పూరి చెక్ ఇచ్చి లాక్ చేయడం జరిగింది. నాగ శౌర్యతో సినిమా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే రోజుల్లో నాగ శౌర్య నుండి క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆయన కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
Double the celebration, double the fun!
Wishing you all a #HappyUgadi as I unveil the title of my upcoming movie. #RANGABALI❤️🔥– https://t.co/sqvT13Xfei@PawanBasamsetti @pawanch19 @DivakarManiDOP #KarthikaSrinivas #ASPrakash @SLVCinemasOffl pic.twitter.com/1wwqdydXkY
— Naga Shaurya (@IamNagashaurya) March 22, 2023