Nani Dasara Movie: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాడు. తనని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అని బలంగా నమ్ముతున్నాడు.టీజర్ , ట్రైలర్ మరియు పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి కానీ,పోస్టర్స్ ని చూస్తుంటే పుష్ప మరియు రంగస్థలం సినిమాలు గుర్తుకొస్తున్నాయి.
ఇప్పుడు రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ లుక్ లో కనపడితే చాలు ప్రేక్షకులు ఇలా పోల్చి చూడడం ప్రారంభించారు. దీనిని అధిగమించడం అనేది పెద్ద సవాల్. బాగున్న సినిమాలు కూడా ఇలా పోల్చి చూసే కారణం చేతనే ఫ్లాప్ అయినవి ఎన్నో ఉన్నాయి.అలా ఈ దసరా సినిమా కూడా ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని నాని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇది నిజంగా ఆయన కెరీర్ ని ఎంతో రిస్క్ లో పెట్టి చేసిన చిత్రం.
సక్సెస్ అయితే నిజంగా అతను చెప్పినట్టు గానే వేరే లెవెల్ కి వెళ్తాడు.ఒక ఫ్లాప్ అయితే మాత్రం పాతాళలోకం లోకి పడిపోతాడు. సినిమా స్టోరీ కూడా చాలా సున్నితమైన అంశం తో కూడుకున్నది. ఇందులో నాని కి హీరోయిన్ ఉండదు,కీర్తి సురేష్ నాని స్నేహితుడిని ప్రేమిస్తుంది అని ఈ కథ గురించి ఒక రూమర్ ఉంది. అదే స్టోరీ కనుక నిజమైతే చాలా కొత్తగా , జనాలను ఎమోషనల్ గా కనెక్ట్ చేసే విధంగా ఉండాలి.
అలా లేకపోతే మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వుధి. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ స్పేస్ ని సరిగ్గా ఉపయోగించుకుంటే నాని ‘దసరా’ వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు.మరి ఆయన అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.