
Music Director Bheems Ceciroleo: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా మారినా సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం చాలా మందికి ఉండదు. కానీ టాలెంట్ ఉన్నవారికి అవకాశాల దారులు పడుతాయని, మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అవుతాయని నిరూపిస్తున్నాడు భీమ్స్ సిసిరోలియో. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన ‘బలగం’, ‘ధమాకా’ సినిమాలు మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. దీంతో భీమ్స్ పేరు మారుమోగుతోంది. ఈ తరుణంలో అయనపై కొందరు హాట్ కామెంట్స్ చేశారు. ‘కాళ్లు మొక్కి ఎదిగావు’ అని అన్నారు. ఈ కామెంట్స్ పై సిసిరోలియో స్పందించారు. తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.
‘నన్ను కాళ్లు మొక్కి ఎదిగావు..’ అని అంటున్నారు. అవును నేను కనిపించని దేవుళ్లకు పట్టించుకోను. కానీ మ్యూజిక్ క్యాసెట్ పట్టుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతల కాళ్లు మొక్కుతా. నా జీవితానికి దారి చూపిన వారి కాళ్లు మొక్కుతా. కనిపించని బండరాళ్లకు మొక్కే కంటే కనిపించే ఈ దేవుళ్ల కాళ్లు మొక్కుతా’ అంటూ సిసిరోలియో ఆవేశంగా మాట్లాడారు. జీవితంలో ఎన్నోకష్టాలు పడి ఇక్కడికి వచ్చానని, ఈ స్టేజీలో ఉండేందుకు ఎందరో నిర్మాతలు, డైరెక్టర్లు తనకు సాయం చేశారని అయ చెప్పుకొచ్చారు.
డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘ఆయుధం’ సినిమాలోని ‘ఓయ్ రాజా కన్నుల్లో నీవే..’ అనే సాంగ్ గుర్తండే ఉంటుంది. ఈ సాంగ్ రాసింది సిసిరోలియోనే. ఈ పాట ద్వారా రచయితగా మారిన ఆయన ఆ తరువాత ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఆ తరువాత 2012లో ‘నువ్వా నేనా’ అనే సినిమాకు తొలిసారిగా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పటి నుంచి సిసిరోలియో కెవ్వు కేక, గాలిపటం, తదితర సినిమాలకు మ్యూజిక్ అందించారు.

లేటేస్టగా ఆయన పనిచేసిన ‘బలగం’, ‘ధమాకా’ సినిమాలో ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ధమాకా సినిమా ప్రమోషన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు తనపై ఏవేవో కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని, కష్టపడితే గుర్తింపు ఎలాగైనా వస్తుందని ఆయన అన్నారు. టాలెంట్ ద్వారానే చాలా మంది మ్యూజిక్ డైరెక్లర్లు ఎదిగారని చెప్పుకొచ్చారు.