Mark Shankar : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) ఇటీవలే సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సంఘటన కోట్లాది మంది అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలోనే కంస్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అక్కడి కార్మికులు ఫైర్ ఇంజన్ వచ్చే వరకు ఆగకుండా, సహాయక చర్యలు మొదలు పెట్టడంతో పిల్లలందరూ ప్రాణాలతో బయటపడ్డారు. పాపం మార్క్ శంకర్ మాత్రం నల్ల పొగ బాగా పీల్చడం వల్ల అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని, అతని పక్కనే ఉన్న ఒక అమ్మాయిని చెరో చేతిలో వేసుకొని తీసుకొచ్చాడు ఒక కార్మికుడు. కానీ దురదృష్టం కొద్దీ ఆ అమ్మాయి చనిపోయింది. మార్క్ శంకర్ ప్రాణాలతోనే ఉండడాన్ని గమనించి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.
Also Read : మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ అదేనా..? మరి సింగపూర్ కి ఎందుకెళ్ళాడు?
చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు అవ్వగా, నల్ల పొగ పీల్చడం తో మార్క్ శంకర్ కి బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ ని అందించారు. ఈ ట్రీట్మెంట్ కి లక్షలు అవుతుంది, లేదా మిలియన్ డాలర్స్ అవుతుంది అనుకుంటే పెద్ద పొరపాటే. కేవలం నాలుగు వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల ఖర్చు మాత్రమే అవుతుంది. పరిస్థితి తీవ్రత ని బట్టి ఏ తరహా బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నవారు ఉచితంగా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే డాక్టర్లు నోటి వద్ద ఒక సున్నితమైన ట్యూబ్ ని అమరుస్తారు. ఆ ట్యూబ్ ద్వారా లంగ్స్ లో చేరిన విషవాయువుని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని వదులుతారు. ఈ ప్రక్రియని ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 30 నిమిషాల లోపే మొదలుపెట్టాలి. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
మార్క్ శంకర్ ఒక విధంగా చెప్పాలంటే మృత్యుంజయుడు అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో అభిమానులు పవన్ కళ్యాణ్ చేసిన ఎన్నో పుణ్యకార్యాల ఫలితం కారణంగానే మార్క్ శంకర్ బయటపడ్డాడని అంటున్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మా బిడ్డ ఇంటికి తిరిగి వచ్చేశాడు, కాకపోతే కాస్త కోలుకోవాల్సిన అవసరం ఉంది, మా కులదైవం ఆంజనేయ స్వామి కృప, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులతో ఆ చిన్నారి త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడు అని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ని చూసి అభిమానులకు ఆనందబాష్పవాలు వచ్చాయి. కుటుంబ విలువలు కనుమరుగు అయిపోతున్న ఈ రోజుల్లో, అన్నదమ్ములు ఇంత ప్రేమ ఆప్యాయతలతో మెలగడం ఎంతో మందికి ఆదర్శప్రాయం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
Also Read : సింగపూర్ లోనే ఉంటున్న పవన్ కళ్యాణ్..మార్క్ శంకర్ పరిస్థితి ఎలా ఉందంటే!