Dinesh Phogat : ఇక ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని బిజెపి అధికారంలో ఉంది. వరుసగా మూడోసారి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది. 2019 ఎన్నికల కంటే.. 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ఎక్కువ సీట్లను సాధించింది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాలను నడుపుతున్నది. ఇటీవల హర్యానా రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరి దశలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అనైక్యత వల్ల అధికారానికి దూరంగా ఉండిపోయింది. ఇక అనూహ్యంగా ఇక్కడ బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చింది.
Also Read : కాంగ్రెస్ నేతలంతా బ్రిటిషర్ల పిల్లలే.. కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
నగదు బహుమతి ఇచ్చింది
హర్యానాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి దినేష్ ఫొగట్ పోటీ చేసింది. అంతకుముందు పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొన్నది. ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే ఫైనల్ లో ఆమె బరువు ఎక్కువగా ఉన్నదనే కారణంతో ఒలంపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు విధించింది. ఫైనల్ పోటీలో పాల్గొనకుండా నిషేధం విధించింది.. అయితే తనకు మెడల్ ఇవ్వాలని వినేష్ ఫొగాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఆ పోటీలలో తనకు అర్హత లేకుండా చేయడంతో వినేష్ ఫొగాట్ ఒక్కసారిగా నిరాశ చెందింది. చివరికి కుస్తీ పోటీలకు వీడ్కోలు పలికింది. ఇక జన్మలో తాను కుస్తీ పోటీలలో పాల్గొనని తేల్చి చెప్పింది. అయితే అప్పట్లో వినేష్ ఫొగాట్ కు కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. చివరికి ఆమె అదే పార్టీలో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎమ్మెల్యేగా గెలిచింది.. అయితే హర్యానాలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. వినేష్ ఫొగాట్ కు నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువగా ఉన్న కారణంతో వినేష్ ఒలంపిక్స్ ఫైనల్ లో అర్హత సాధించలేదు. అయితే ఆమెకు మెడల్ విన్నెర్స్ కు ఇచ్చే గౌరవాన్ని అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు, ఉద్యోగం, నగదు.. వీటిల్లో ఏది కావాలో కోరుకోవాలని ప్రభుత్వం సూచించగా.. ఆమె నాలుగు కోట్ల నగదుకే మొగ్గు చూపించారు. దీంతో వినేష్ ఫొగాట్ కు నాలుగు కోట్ల నగదు బహుమతి ఇవ్వనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బిజెపి ప్రభుత్వం నాలుగు కోట్ల నగదు బహుమతి ఇస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇక జాతీయ మీడియాలో అయితే వార్తల ప్రవాహం సాగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఆమెను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాకుండా.. ఒక క్రీడాకారిణి లాగానే చూడాలని.. అందువల్లే ప్రభుత్వం ఆమెకు నగదు బహుమతి ఇస్తోందని పేర్కొన్నారు. ఆ స్థానంలో తాము ఉన్నా కూడా అదే చేస్తామని వివరించారు.
Also Read :పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ వైద్యానికి అయిన ఖర్చు ఇంతేనా..?