Mark Shankar : రెండు మూడు రోజుల నుండి నేషనల్ లెవెల్ మీడియా నుండి లోకల్ మీడియా వరకు ఎక్కడ చూసినా మన అందరికీ వినిపిస్తున్న పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ఇతను పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు. ఇతన్ని అభిమానులు ఎప్పుడో రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు చూసారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కనపడలేదు. పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ ఎన్నో సార్లు మీడియా కి కనిపించాడు కానీ, మార్క్ శంకర్(Mark Shankar) అసలు కనపడదు ఏంటి?, అసలు ఇతను ఇండియా లోనే ఉంటున్నాడా?, లేదా విదేశాల్లో చదువుతున్నాడా? అనే సందేహం అభిమానుల్లో ఎప్పటి నుండో ఉంది. రీసెంట్ గానే సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్నాడా?, ఇన్ని రోజులు ఇండియా లోనే చదువుతున్నాడని అనుకున్నామే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Also Read : సింగపూర్ లోనే ఉంటున్న పవన్ కళ్యాణ్..మార్క్ శంకర్ పరిస్థితి ఎలా ఉందంటే!
ఇదంతా పక్కన పెడితే అందరూ అనుకుంటున్నట్టుగానే మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నాడా?, లేదా హైదరాబాద్ లో చదువుతున్నాడా? అనే విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము. బాగా పరిశీలించిన తర్వాత తెలిసిన విషయాలు ఏమిటంటే, మార్క్ శంకర్ హైదరాబాద్ లోనే చదువుకుంటున్నాడు. కేవలం అతను మాత్రమే కాదు, సోదరి పోలేనా కూడా ఇక్కడే చదువుకుంటుంది. ప్రస్తుతం మార్క్ శంకర్ మూడవ క్లాస్ చదువుతున్నట్టు తెలుస్తుంది. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్స్ ని నిర్వహించే సంగతి మన అందరికీ తెలిసిందే. చిన్న తనంలో మనం కూడా ఎన్నో సమ్మర్ క్యాంప్స్ కి వెళ్లి ఉంటాము. కేవలం విద్య మాత్రమే కాదు, ఇతర విషయాల్లో కూడా నైపుణ్యం పెంచుకునేందుకే పిల్లల కోసం ఈ సమ్మర్ క్యాంప్స్ ని నిర్వహిస్తూ ఉంటారు. అలా సింగపూర్ లో ‘టమోటో కుకింగ్ స్కూల్’ అని ఒకటి ఉంది. అక్కడ పిల్లలకు వాళ్లకు అవసరమయ్యే ఆహారాన్ని, వాళ్ళే స్వయంగా నేర్చుకునేలా ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట.
మార్క్ శంకర్ ఆ క్యాంప్ లో పాల్గొనడం కోసమే వెళ్ళాడు. మార్చి నెలలో ఈ క్యాంప్ మొదలైంది. మే 16 వరకు కొనసాగుతుంది. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ఈ విపత్తు చోటు చేసుకుంది. మార్క్ శంకర్ సురక్షితంగానే బయటపడ్డాడు, మిగిలిన పిల్లల ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ ప్రమాదం లో మార్క్ శంకర్ పక్కనే కూర్చున్న అమ్మాయి చనిపోయిందని స్వయంగా పవన్ కళ్యాణ్ మొన్న ప్రెస్ మీట్ లో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సింగపూర్ లోనే ఉన్నాడు. ఈ సోమవారం రోజున ఇండియా కి తిరిగి వస్తాడని అంటున్నారు. ఇండియా కి వచ్చిన వెంటనే ఆయన ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెల 22 లోపు తనకు సంబంధించిన వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి మళ్ళీ ప్రభుత్వ విధుల్లో జాయిన్ అవ్వబోతున్నాడు.
Also Read : నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!