
Manchu Manoj Second Marriage: మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడని గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ కొంతకాలం నుండి ప్రేమలో ఉన్నాడు.పలు సందర్భాలలో వీళ్లిద్దరు బయట కలిసి తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
Also Read: Vijayashanthi- Actor Suresh: విజయశాంతి ఎఫైర్, మేటర్ పెళ్లి వరకు… సడన్ గా దూరం పెట్టిన స్టార్ హీరో!
వీళ్లిద్దరికీ ఇది రెండవ పెళ్లి అవ్వడం విశేషం,ఈరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ వివాహ మహోత్సవం మంచు మనోజ్ అక్క లక్ష్మి ప్రసన్న ఇంట్లో జరగనుంది.ఈ సందర్భంగా మౌనిక ని పెళ్లి కూతురు లాగ ముస్తాబు చేసిన ఫోటోని మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసాడు.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అభిమానులు ఆయనకీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ పెళ్ళికి మనోజ్ మనసుకి ఎంతో దగ్గరైన కొంతమంది స్నేహితులు మరియు బంధుమిత్రులు మాత్రమే హాజరవుతున్నారు.ఈ పెళ్ళికి మంచు మోహన్ బాబు మరియు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు హాజరు కావడం లేదని తెలుస్తుంది.కుటుంబం లో ఒక్క మంచి లక్ష్మి తప్ప మిగిలినవాళ్ళెవ్వరికీ మనోజ్ రెండవ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని,భూమా మౌనిక తో ప్రేమ వ్యవహారం నడిపినందుకే మోహన్ బాబు మనోజ్ ని దూరం పెట్టాడని, ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.మరి వీటిల్లో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ గత కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా సంగతి తెలిసిందే.ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.ఆ తర్వాత కొనేళ్లకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని ప్రారంభించాడు కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.
Also Read: Sreeleela Remuneration: పాపం శ్రీలీల..చేతిలో 10 సినిమాలు..కానీ పారితోషికం అంతేనా..?