Lufthansa Plane: ఫ్లైట్ అనేది సుదీర్ఘమైన ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంది. దాదాపు కొన్ని గంటల పాటు గాల్లోనే ఉంటుంది. అలాంటప్పుడు పైలట్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంధనం దగ్గర నుంచి మొదలు పెడితే టేకాఫ్ వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే విమానం సాఫీగా నడవగలుగుతుంది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి తేడా అయినా సరే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఫ్లైట్ నడిపే పైలెట్ జాగ్రత్తగా ఉండాలి అంటారు.
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
పైలట్ లేకుండానే..
లుప్తాన్సాలోని ఓ విమానం పైలెట్ లేకుండానే నడవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు పది నిమిషాల పాటు ఆవిమానం ప్రయాణించింది. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన వార్త సంస్థ డిపిఏ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి 17న ఫ్రాంక్ ఫర్ట్ నుంచి లుఫ్తాన్సా విమానం బయలుదేరింది. ఈ క్రమంలో పైలెట్ అర్జెంటుగా రెస్ట్ రూమ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో కో పైలట్ గాఢ నిద్రలో ఉన్నాడు. స్పృహ కూడా తప్పిపోయినట్టుగా అతడు కనిపించాడు. అనేక సందర్భాల్లో పైలట్ అతడిని లేపినప్పటికీ చలనం లేదు. దీంతో ఏదైతే అది జరుగుతుందని భావించిన పైలట్.. వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్ళాడు. పదినిమిషాల తర్వాత వచ్చాడు. అయినప్పటికీ ఆ విమానం సురక్షితంగానే ప్రయాణం సాగించింది. అయితే ఈ విషయం ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కథనం వెలుగులోకి రావడంతో సదరు పైలెట్ పై చర్యలు తీసుకుంటారా? లేక కో పైలట్ ను విధుల నుంచి తొలగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే లుఫ్తాన్సా ప్రాంతంలో విమానాలు తక్కువగానే తిరుగుతుంటాయి. అయితే ఆ పైలట్ రెస్ట్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది.దీంతో పైలట్ లేకుండానే పది నిమిషాల పాటు విమానం గాలిలో ప్రయాణించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానానికి ఏ ప్రమాదం వాటిల్ల లేదు. ఒకవేళ ప్రమాదం కనుక జరిగితే పరిస్థితి మరో విధంగా ఉండేది. మొత్తంగా ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.