Balakrishna: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులు చాలామంది ఉన్నప్పటికి సీనియర్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. 60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా మంచి సినిమాలను చేయడానికి సీనియర్ హీరోలు పడే తాపత్రయం చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుంది…ఇక ప్రస్తుతం బాలయ్య బాబు సైతం ‘అఖండ 2’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు…
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. బాలయ్య బాబు (Balayya Babu) లాంటి నటుడు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్య కథాంశమైతే ఉంటుంది. ఆయన చేయబోతున్న ప్రతి సినిమా ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ (Akhanda) తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… ఇక అఖండ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి చూస్తున్నారు. ఈ సినిమా దెబ్బకి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న కొన్ని రికార్డులు ఎగిరిపోతాయి అంటూ బాలయ్య బాబు అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది.
తద్వారా ఈ సినిమాతో వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే సీనియర్ హీరోలందరికి పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్న బాలయ్య వరుసగా నాలుగు విజయాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం. మరి ఇప్పటివరకు బాలయ్య బాబు సాధించిన విజయాలు అతన్ని ఒక రేంజ్ లో నిలబెడితే ఇకమీదట సాదించబోయే విజయాలు ఆయన్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వాళ్ళ మూడు సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక్కో సినిమా నుంచి మరొక సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే అందుకు కారణం. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. అందువల్లే మంచి సినిమాలు రావడానికి ఆస్కారమైతే ఉంటుంది…