Homeట్రెండింగ్ న్యూస్Love Agreement: రూ.100 బాండ్ పేపర్ పై ప్రేమికుల అగ్రిమెంట్

Love Agreement: రూ.100 బాండ్ పేపర్ పై ప్రేమికుల అగ్రిమెంట్

Love Agreement: వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందంటారు. అది మనిషికో రకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో కొత్త తరహా ప్లాన్లు, పథకాలు అమల్లోకి వస్తున్నాయి. పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అన్నారు. అదే కోవలో మనిషి కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇందులో భాగంగానే ఓ గమ్మత్తైన ఆలోచన చేశాడు. మనం సాధారణంగా ఆస్తుల విషయంలో బాండ్ రాసుకుంటాం. అలాగే మాటల విషయంలో కూడా బాండ్లు రాసుకోవడం సాధారణమే. కానీ లవర్స్ కూడా బాండ్ రాసుకుంటే ఎలా ఉంటుందనేది కొత్త పాయింట్. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాన్సెప్ట్ కు అందరు ఫిదా అవుతున్నారు.

Love Agreement
Love Agreement

ఏదైనా ఒప్పందంలో ఇద్దరు మాట తప్పకుండా ఉండేందుకు బాండ్ రాసుకుంటారు. అది ఆస్తులు, డబ్బులు, ఇంకా ఇతరత్రా కారణాలతో మనం నిత్యం బాండ్ పేపర్లు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ విచిత్రమైన కోణం దాగి ఉంది. ఇద్దరు ప్రేమికులు కూడా బాండ్ పేపర్ మీద రాసుకుని ఒప్పందం ప్రకారం బతకాలని నిర్ణయించుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కొత్త తరహా ప్రణాళికలకు ఆన్ లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రేమికులకు కూడా ఓ ఒప్పందం ఉండాలని భావిస్తోంది.

Also Read: NTR Jayanthi: తెలుగులో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరో ఎవరో తెలుసా?

దీనికి గాను రూ. 100 బాండ్ పేపర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో వారిద్దరి మధ్య జరిగే ఒప్పందం మేరకు ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు తమ ప్రేమను తగ్గించుకోకూడదు. రొమాంటిక్ గా జీవితాంతం తనతో కలిసే ఉంటానని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఇద్దరి మద్య కుదిరిన అంగీకారం ప్రామాణికంగా వారి జీవనం సాగిపోనుంది. ఇలాంటి కొత్త ఆలోచనలు చేస్తున్న సంస్థలతో ప్రేమికుల్లో అగ్రిమెంట్ చేసుకునే వరకు వెళ్లడం ఆశ్చర్యకరమే.

ప్రత్యేకంగా బాండ్ పేపర్ తీసుకురావడంతో ఇక లవర్స్ తమ భవిష్యత్ పై భరోసా కలిగి ఉంటారని చెబుతోంది. ఎందుకంటే బాండ్ పేపర్ తో ప్రియుడైనా ప్రియురాలైనా తప్పు చేసేందుకు వెనకడాడతారని చెబుతోంది. ఏదిఏమైనా బాండ్ పేపర్ లవ్ ప్రేమికులను ఏం చేస్తుందో? ఎందాక తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పోవడంతో చాలా మంది ప్రేమికులు ప్రియురాళ్లను వాడుకుని వదిలేస్తున్నారే కోణంలో ఆలోచించి ఈ తరహా అగ్రిమెంట్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రేమికులు ఇక హాయిగా ఉండొచ్చనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఓ సంస్థ ప్రోద్బలంతో ఇలా ప్రేమికుల కోసం బాండ్ పేపర్ తీసుకురావడం సంచలనం సృష్టిస్తోంది.

Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి ఉన్న రిలేషన్ తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version