Heroines : ఆడ – మగ పరస్పరం కలిస్తేనే ఒక జాతి పుట్టుక సాధ్యమవుతుంది. దీనినే సైన్స్ పరిభాషలో జీవ ఉద్భవం అంటారు. ఇది సాధారణంగా జరిగేదే. ఆడ జీవిని చూడగానే మగ జీవికి.. మగ జీవిని చూడగానే ఆడ జీవికి ఆకర్షణ కలగడం సర్వసాధారణం. ఆకర్షణ ఎంత గాఢంగా ఉంటే.. వాంఛ అంత బలంగా ఉంటుంది. తద్వారా ప్రేమ దృఢమవుతుంది.. ప్రేమ దృఢంగా ఉంటే ఆడ, మగమధ్య శారీరక సాన్నిత్యం అత్యంత పటిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక జాతి పుట్టుకకు వారి కలయిక తోడ్పడుతుంది.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.
Also Read : సౌత్ లో యువరాణి పాత్రల్లో మెప్పించిన హీరోయిన్స్ వీళ్ళే!
ఇద్దరు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ ప్రేమలో పడుతుంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. చివరికి సినిమాకు శుభం కార్డు పడుతుంది. కానీ ఈ కథనంలో ఇద్దరు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికీ నిజం. అమెరికాలో క్రిస్టెన్ స్టీవర్ట్, డైలాన్ మేయర్ అనే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వీరిద్దరూ అమెరికాలో యువ నటీ మణులుగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరికి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఏం జరిగిందో తెలియదు.. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 2013లో ఒక సినిమా సెట్ లో ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండు సంవత్సరాలు పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారు. తర్వాత 2021లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.. క్రిస్టెన్ ట్విలైట్, ఫ్రాంచైజీ అనే సినిమాల ద్వారా అమెరికాలో బాగా ఫేమస్.. ఇక డైలాన్ మేయర్ నటిగా, రచయితగా అనేక సినిమాలకు పని చేశారు. క్రిస్టెన్, డైలాన్ మేయర్ ప్రేమను మొదట్లో వారి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు బయటికి వచ్చేసారు. ఆ తర్వాత డేటింగ్ మొదలుపెట్టారు. చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.. పెళ్లిలో డైలాన్ మేయర్, క్రిస్టెన్ తెలుపు రంగులో ఉన్న గౌన్లు ధరించారు. సంప్రదాయ క్రిస్టియన్ పద్ధతి ప్రకారం ఒకరికి ఒకరు రింగులు తొడుక్కున్నారు. ఆ తర్వాత చెరో గ్లాసులో వైన్ తాగారు. అనంతరం చేతిలో చేయి వేసుకొని నడిచారు. వేడుకకు వచ్చిన సన్నిహితులకు అద్భుతమైన విందు అందించారు. మొత్తానికి వీరిద్దరి వివాహం హాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ తరహా వివాహాలు పాశ్చాత్య దేశాలలో ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.. మొదట్లో ఇలాంటి వివాహాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. చివరికి ఒప్పుకోక.. వారి పెళ్లికి సమ్మతం చెప్పక తప్పడం లేదు.
Also Read : ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు వీళ్ళే!