Heroine : ఆ తర్వాత మాత్రం వాళ్లు ఆ క్రేజ్ కొనసాగించలేక సినిమా ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉంటున్నారు. టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలలో నటించి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఇందులో ఒకరు. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హీరోయిన్గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందంతో, అభినయంతో అలాగే నటనతో యువతను కట్టిపడేసింది. కేవలం తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక వీడియో కానీ ఫోటోలు కానీ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను చూసి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ హీరోయిన్ కామ్నా జట్మాలని. తెలుగులో ఈమె చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
Also Read : నితిన్ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా
గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమాతో కామ్నా జట్మలాని హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఒకప్పుడు ఈమె తెలుగులో యూత్ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. రింగు రింగుల జుట్టుతో, చూడ చక్కని అందంతో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు రణం సినిమాతో బాగా దగ్గరయింది కామ్నా. తెలుగులో ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. రణం సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత ఈమె అల్లరి నరేష్ కు జోడిగా బెండు అప్పారావు అనే సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కామ్నా జఠ్మలానీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడలో కూడా పలు సినిమాలలో నటించే ప్రేక్షకులను అలరించింది.
కానీ ఆమె చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయాయి. దీంతో ఈమెకు నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కామ్నా జట్మాలని ఆగస్టు 11, 2014లో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన ఫొటోస్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ అప్పటికి ఇప్పటికీ కామ్న జఠ్మలానీ ఏమాత్రం మారలేదు అని తెలుస్తుంది. ఇప్పటికీ అదే అందంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
Also Read : పూరి జగన్నాథ్ తో వరుసగా హ్యాట్రిక్ హీట్.. కానీ ప్రస్తుతం షాక్ అయ్యేలాగా మారిపోయిన హీరోయిన్..