Leopards and Humans Live Together: చిరుతపులులు పులి జాతిలోనే ప్రత్యేకమైనవి. ఈదురు దాడికి దిగడంలో.. దాడి చేయడంలో వాటి తర్వాతే ఏ జంతువులైనా.. అందుకే అవి వేటాడే విధానంలో తమ ప్రత్యేకతను చూపిస్తుంటాయి. పైగా ప్రత్యర్థి జంతువులను తినడంలో వైవిధ్యాన్ని కనబరుస్తుంటాయి. అయితే ఇలాంటి చిరుతపులులు సాధు జంతువులుగా మారిపోతే? సాటి మనుషులతో కలిసి పెరిగితే? జనావాసాలలోనే ఆవాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తే? ఇదేంటి ఇలాంటి సాధ్యం కాని ప్రశ్నలు వేస్తున్నారు.. ఇది ఎలా వాస్తవ రూపం దాల్చుతుంది? అనే సమాధానం మీ నుంచి వస్తోంది కదూ. అయితే ఈ కథనం చదివేయండి.. మీకే ఒక క్లారిటీ వస్తుంది.
రాజస్థాన్.. పేరు చెప్తే ఎడారి మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ రాజస్థాన్లోని దట్టమైన అడవులు ఉన్నాయి. పచ్చని పల్లెలు ఉన్నాయి. నాగరిక జీవనానికి దూరంగా బతికే గ్రామాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాలు విస్తరించినచోట పచ్చదనం కనువిందు చేస్తూ ఉంటుంది. పైగా ఇక్కడ జంతువులు కూడా విస్తారంగా కనిపిస్తుంటాయి. ఆరావలి పర్వతాలు విస్తరించినచోట బెరా అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామం నాగరిక జీవనానికి చాలా దూరంగా ఉంటుంది. ఆరావళి పర్వతాలలో ఇక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఈ ఆవాసం చిరుతపులులు జీవించడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది.
Also Read: 100 years old tea stall: ఓనర్ కనిపించని వంద సంవత్సరాల టీ స్టాల్ ఇది.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే?
ఇక్కడ 50 కి పైగా చిరుతపులులు అత్యంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అలాగని బెరా గ్రామం అభయారణ్యం కాదు. ఈ గ్రామంలోని ఇండ్లు, దేవాలయాలు, పొలాల మధ్య చిరుతపులులు సంచరిస్తూ ఉంటాయి. సాధు జంతువులుగా అవి వెలుగొందుతున్నాయి. చిరుతపులులు ఈ గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మేకలకు, ఇతర జీవాలకు, మనుషులకు ఎటువంటి హాని కలిగించవు. గత దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో చిరుతపులులు అవి నా భావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ గ్రామంలో రబారీ సామాజిక వర్గం వారు జీవిస్తుంటారు. మీరు ఆంజనేయుడిని పూజిస్తుంటారు. వీరు మాంసాహారం ముట్టరు. పైగా జంతువులను ప్రేమతో దగ్గర తీసుకుంటారు. పొరపాటున కూడా హాని తలపెట్టరు.
ఈ గ్రామంలో ఉన్న గ్రానైట్ కొండలలో.. ఇతర రాతి గుహలలో చిరుతపులులు ఆవాసంగా ఏర్పరచుకొని.. రాత్రిపూట సేద తీరుతూ ఉంటాయి. గ్రామంలో ఉన్న హనుమంతుని గుడి.. పొలాలు.. ఇళ్లల్లో చిరుత పులులు నివాసం ఉంటాయి. ఇక్కడ జంతువులకు ఏమాత్రం ఇవి హాని కలిగించవు. కాకపోతే అడవుల్లోకి వెళ్లి ఇతర జంతువులను వేటాడి తింటాయి.
Also Read: Hindu-Muslim Couples : ఒకే వేదికపై ఒక్కటైన హిందూ – ముస్లిం జంటలు! ఇది కదా మతసామరస్యం..
ఈ చిరుతపులులను స్థానికులు దైవం తమకోసం పంపిన సంరక్షకులుగా భావిస్తుంటారు. అందువల్ల వీటికి ఎటువంటి హాని తలపెట్టరు. పైగా వాటిని దైవాలుగా భావిస్తుంటారు. తమ పండుగల సమయంలో చిరుతపులులకు పూజలు కూడా చేస్తుంటారు. అయితే ఇక్కడ మనుషులతో చిరుతపులులకు అవినాభావ సంబంధం ఉన్న నేపథ్యంలో.. పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. చిరుత పులులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అయితే ఈ పులులు పర్యాటకులను కూడా ఏమీ అనకపోవడం విశేషం.