Hindu-Muslim Couples : ప్రజల వీక్నెస్ పాయింట్ గుర్తించిన రాజకీయ నాయకులు కులాలవారీగా ప్రజలను విడదీస్తూనే ఉన్నారు. మతాలవారీగా విభజన రేఖ గీస్తూనే ఉన్నారు. తమ రాజకీయ పబ్బం కోసం ప్రజలను బలి పశువులను చేస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకుల వల్ల స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. మనదేశంలో ఇంకా కులాల కంపు పోవడం లేదు. మతం మత్తు వదలడం లేదు. ఎవడో సృష్టించిన కులాన్ని పట్టుకొని నేటికీ జనం వేలాడుతూనే ఉన్నారు. కులం ప్రాతిపదికనే మనుగడ కొనసాగిస్తున్నారు. ఇక మత పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం మతాల ఆధారంగానే మనదేశంలో ఎన్నో అల్లకల్లోలాలు జరిగాయి. ఈ గొడవల్లో మన దేశం చాలా నష్టపోయింది. వేలాదిమంది ప్రజల రుధిరంతో ఈ దేశం నేల తడిచిపోయింది. ఆర్తుల కన్నీటితో ఈ పుడమి తల్లడిల్లింది. అయినప్పటికీ కులం, మతం ఈ దేశం నుంచి విడిపోవడం లేదు. నేటి స్మార్ట్ కాలంలోనూ కులం, మతం అనేవి ఇంకా బలంగా వేళ్ళునుకుంటున్నాయి. అయితే ఇలాంటి కాలంలో కొంతమంది చేస్తున్న పని సమాజ గతి మారాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
Also Read : లిక్కర్ స్కాం లో డ్రాగన్ సినిమా నటి.. అధికారుల విచారణలో విస్తు పోయే వాస్తవాలు
ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కొన్ని సామాజిక వర్గాల వారు కట్టుబాట్లు ప్రదర్శిస్తుంటారు. ఇతర సామాజిక వర్గాల వారిని తమ వేడుకలకు ఆహ్వానించారు. ఇక మతాలపరంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సంఘటన మహారాష్ట్రలోని పూణే ప్రాంతాల్లో జరిగింది. పూణేలోని వనవాడి ప్రాంతంలో ఓ హిందూ జంట వివాహం జరుగుతుండగా.. భారీగా వర్షం కురిసింది. దీంతో టెంట్ లో నుంచి నీరు కారింది. వివాహ వేడుకకు ఆటంకం ఏర్పడింది. ఇక ఆ పక్కనే తో కళ్యాణ మండపంలో ముస్లిం జంట రిసెప్షన్ జరుగుతోంది. హిందూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేయడంతో.. ఆ మండపాన్ని ఉపయోగించుకోవడానికి వారు సమ్మతం తెలిపారు. దీంతో ఆవేదిక మీద హిందూ జంట ఒకటైంది. ఆ జంటకు ముస్లిం జంట కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. పైగా ఈ రెండు జంటలు పరస్పరం ఒకే వేదిక మీద ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.. మతాల మత్తులో.. కులాల కుంపట్లలో చిక్కి శల్యం అవుతున్న కొంతమందికి ఈ దృశ్యం విలువైన పాఠంగా నిలిచింది.
” వివాహ వేడుక జరపడానికి భారీగా ఏర్పాట్లు చేశాం. కానీ అనుకోకుండా భారీ వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో పక్కనే ఉన్న ముస్లింలకు మా బాధను వివరించాం. ఫలితంగా వారు మా ఆవేదనను అర్థం చేసుకున్నారు.. వారి మండపంలో మా వేడుకకు అనుమతించారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుక జరిగింది.. వచ్చిన బంధువులను కూడా వారు గొప్పగా రిసీవ్ చేసుకున్నారని” హిందూ జంట కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.