Homeట్రెండింగ్ న్యూస్100 years old tea stall: ఓనర్ కనిపించని వంద సంవత్సరాల టీ స్టాల్ ఇది.....

100 years old tea stall: ఓనర్ కనిపించని వంద సంవత్సరాల టీ స్టాల్ ఇది.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే?

100 years old tea stall: ఇక పెద్దపెద్ద హోటల్స్ లో అయితే బేరర్స్ వచ్చి టీ సర్వ్ చేస్తుంటారు. మనం టీ తాగినందుకు డబ్బులు చెల్లిస్తుంటాం. ఇది ఎప్పటినుంచో ఉన్నదే. కొన్ని ప్రాంతాలలో అయితే టీ తాగడానికి ముందు టోకెన్లు తీసుకుంటాం. కొన్ని హోటల్స్ లో అయితే టీ తాగిన తర్వాత డబ్బులు చెల్లిస్తాం. ఇక మనం తాగిన హోటల్ బట్టి.. అందులో ఉన్న సౌకర్యాలను బట్టి..టీ లో ఉన్న నాణ్యతను బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు.. ఇక మన దేశంలో టీ తాగడం అనేది చాలామందికి ఒక అలవాటు. ఇక శ్రీమంతులైతే అత్యంత ఖరీదైన తేయాకుతో తయారుచేసిన పొడితో టీ తాగుతుంటారు. కాకపోతే ఈ చాయ్ అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది..

మనదేశంలో టీ స్టాల్స్ లక్షలలో ఉంటాయి. ఇక టీ విక్రయించే హోటల్స్ కూడా చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో టీ స్టాల్ మాత్రం పూర్తి భిన్నమైనది. దీనికి వంద సంవత్సరాలచరిత్ర ఉంది. వంద సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. పెద్ద హంగామా.. ఆర్భాటం లాంటివి అక్కడ కనిపించవు. అత్యంత సింప్లిసిటీతో ఆ హోటల్ ఉంటుంది. వంద ఏళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ అక్కడ కస్టమర్లు ఏమాత్రం రాకుండా ఉండడం లేదు. వస్తున్నారు.. టీ తయారు చేసుకొని తాగి వెళ్తున్నారు..

Also Read: Hindu-Muslim Couples : ఒకే వేదికపై ఒక్కటైన హిందూ – ముస్లిం జంటలు! ఇది కదా మతసామరస్యం..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్వాతంత్ర సమరయోధుడు నరేష్ సోమ్ ఈ టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది. నరేష్ పూర్వీకులు ఈ టీ స్టాల్ ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ చాయ్ దుకాణంలో యజమానులు కనిపించరు. ఒకవేళ టీ తాగాలి అనుకుంటే.. వ్యక్తులే స్వయంగా తయారు చేసుకోవాలి. పాలు, టీ పౌడర్, ఇలాచి పౌడర్, పంచదార, అల్లం పేస్ట్ అక్కడ అందుబాటులో ఉంటాయి. గ్యాస్ కూడా రెడీగా ఉంటుంది. తాగడానికి గ్లాసులు కూడా అందుబాటులో ఉంటాయి. టీ తాగాలి అనుకున్న వారు సొంతంగా తయారు చేసుకోవాలి. టీ తయారు చేసుకుని తాగిన తర్వాత.. డబ్బులను అక్కడ ఉన్న పెట్టెలో వేసి వెళ్ళిపోవాలి. ఇక ప్రతిరోజు రాత్రి ఆ టీ స్టాల్ ప్రస్తుతం తరం ఓనర్ అశోక్ చక్రవర్తి ఆ డబ్బు తీసుకొని వెళ్తాడు. ఇక వచ్చిన డబ్బుతోమరుసటి రోజుకు సరుకులు కొని అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. అయితే నాటి నుంచి నేటి వరకు ఈ టీ స్టాల్ లాభాల్లోనే ఉంది. దీనిద్వారా నరేష్ పూర్వీకులు భారీగానే సంపాదించారు.

Also Read: Highest Score in IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో 9 మంది ప్లేయర్లు..ఇదే తొలిసారి!

ఇప్పుడు నాలుగో తరం ఆధ్వర్యంలో ఆ టీ స్టాల్ నడుస్తోంది. అన్నట్టు కస్టమర్లే స్వయంగా టీ తయారు చేసుకోవడం వల్ల నాణ్యత విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేవు. పైగా టీ స్టాల్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా రాత్రిపూట నిర్వాహకులు చేస్తారు. ఇక పగటిపుట మాత్రం అక్కడ ఏమాత్రం అందుబాటులో ఉండరు. ఇక్కడ టీ తాగిన వారంతా తమకు తోచినట్టు మాత్రమే కాకుండా.. కాస్త ఎక్కువగానే డబ్బులు అందులో వేస్తారు. ప్రతిరోజు ఈ టీ స్టాల్ కౌంటర్ పది నుంచి 15 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఈ టీ స్టాల్ ప్రారంభించినప్పుడు ప్రతిరోజు కౌంటర్ ఐదు రూపాయల వరకు ఉండేదట. ఐదు రూపాయలు ఉన్నప్పటికీ అప్పట్లో ఆ డబ్బు చాలా ఎక్కువ అని స్థానికులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version