
Krithi Shetty: కృతి శెట్టికి గడ్డుకాలం నడుస్తుంది. మొన్నటి వరకు వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న కృతి రేసులో వెనుకబడ్డారు. గత ఏడాది ఆమెకు కలిసి రాలేదు. వరుసగా మూడు ప్లాప్స్ పడ్డాయి. బంగార్రాజు చిత్రం తర్వాత నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పరాజయం పొందాయి. దీంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. దానికి తోడు శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది. కృతి శెట్టి ఆఫర్స్ మొత్తం శ్రీలీల కొట్టేసినట్లు టాక్.
అలా అని కృతి శెట్టికి అవకాశాలు ఆగలేదు. ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగ చైతన్యకు జంటగా కస్టడీ చిత్రం చేస్తున్నారు. తన ఇమేజ్ కి భిన్నంగా ఓ సీరియస్ రోల్ చేస్తుంది. కస్టడీ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. వెంకట్ ప్రభు దర్శకుడు. బంగార్రాజుతో హిట్ కాంబో అని నిరూపించుకున్న ఈ జంట మరోసారి జతకడుతున్నారు. అలాగే కృతి శెట్టికి కార్తీకి జంటగా ఓ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం.
ఓ మలయాళ చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందట. అయితే ఇది గ్లామరస్ రోల్ అట. గతంలో కృతి శెట్టి శృంగార సన్నివేశాల్లో నటించారు. ఆమె కెరీర్లో భారీ హిట్స్ గా ఉన్న శ్యామ్ సింగరాయ్, ఉప్పెన చిత్రాల్లో ఆమె శృంగార సన్నివేశాల్లో నటించారు. కానీ స్కిన్ షో చేయలేదు. నిండైన బట్టల్లో పద్దతిగా కనిపించారు.

అయితే నెక్స్ట్ మూవీలో ఆమె బికినీలో దర్శనమిచ్చే అవకాశం కలదట. నిర్మాతలు ఈ మేరకు చర్చలు జరుపుతున్నారట. ఆ చిత్రంలో కృతి శెట్టితో బికీనీలో దర్శనమిస్తారట. అందుకు కృతి శెట్టికి డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. సాధారణంగా కృతి రూ. 2 కోట్ల వరకు తీసుకుంటుంది. బికినీ ధరించేందుకు సిద్ధమైతే కృతికి రూ. 4 కోట్లు ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. పరిస్థితులను బట్టి మారక తప్పదు. స్ట్రగుల్ అవుతున్న కృతి ఈ ఆఫర్ ఓకే అవకాశం కలదు…