
True Friend : స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారు సినీ కవులు. స్నేహంలో ఉన్న మాధుర్యం అలాంటిది. మన బాధలు చెప్పుకోవడానికి ఓ మంచి స్నేహితుడు ఉంటే మన కష్టాలు సగం పోయినట్లే. స్నేహితుడు ఎప్పుడు మన హితం కోరుకునే వాడే. మనలోని లోపాలు నిత్యం ఎత్తిచూపేవాడే స్నేహితుడు. నిజమైన స్నేహితుడు మనలోని తప్పులు వెతుకుతాడు. మన పతనం కోరుకునే వాడు మనల్ని నిత్యం పొగుడుతుంటాడు.
మనలోని లోపాలను ఎత్తి చూపితేనే మనం చేసే తప్పులు తెలుస్తాయి. అంతేకాని మనకు నిరంతరం సలహాలు, సూచనలు లేకపోతే మన మనుగడ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. అందుకే మనకు నిజమైన స్నేహితుడు ఉంటే మనం దారి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఏర్పడుతుంది. ఈనేథ్యంలో స్నేహితుడు మన హితం కోరుకునేవాడే కావడంతో మనకు ఎలాంటి ఆపద రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తుంటాడు.
స్నేహం గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్నో జీవితాలు స్నేహానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. స్నేహితుడు మన మేలు కోరేవాడుగానే ఉంటాడు. మనకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఎల్లప్పుడు మన మార్గాన్ని నిర్దేశిస్తుంటాడు. దీంతో మనం చేసే తప్పులను ఎత్తి చూపుతూ సరైన దారిలో నడిచేందుకు సూచనలు చేస్తుంటాడు.
ఇలా మన జీవన గమనంలో తప్పుడు దారుల్లో వెళ్లకుండా చూస్తాడు. మనకు కలిగే ఆపదలను ముందే హెచ్చరిస్తాడు. సరైన మార్గంలో నడవకపోతే కలిగే దుష్ర్పభావాలను వివరిస్తాడు. సమాజంలో మన స్థానం దెబ్బతినకుండా చేస్తాడు. మన మంచి కోరే హితుడు. మన మార్గాలను సూచించే మార్గదర్శిగా స్నేహితుడు నిలవడం సహజం. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఆంగ్లంలో సామెత ఉంది.