
TTD : తిరుమలలో భక్తుల రద్దీ మొదలైంది. వేసవి సెలవులు రావడంతో భక్తుల సంఖ్య ఎక్కువవుతోంది. శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య తగ్గిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు బ్రేక్ దర్శనం కోటా కుదిస్తోంది. కాలినడకన వచ్చే భక్తుల కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్టు జారీ చేస్తున్నారు. సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాల్లోనూ ఇస్తున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. సర్వదర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది. వైకుంఠం కాంప్లెక్స్ లలోని పదమూడింటిలో భక్తులు వేచి ఉంటున్నారు. దీంతో భక్తుల రద్దీతో దర్శనానికి సమయం పడుతోంది.
టోకెన్లు లేకుండా సర్వదర్శనం లైన్లలో ఉన్న భక్తులకు ఇరవై నాలుగు గంటలు పడుతోంది. రూ.300 ల శీఘ్రదర్శన టికెట్లు తీసుకున్న వారికి మూడు గంటలు పడుతోంది. భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. ఇతర మార్గాల్లో వెళితే గమ్యం చేరలేరు. శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తున్నారు.
భక్తులు ఈ మార్పులను గమనించాలి. విద్యార్థులకు పరీక్షలు ముగిసినందున భక్తుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అధికారులు భక్తుల సౌకర్యార్థం పలు రకాల చర్యలు చేపడుతోంది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు అధికారులకు సహకరించాలని టీటీడీ కోరుతోంది. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచిస్తోంది.