RK phone tap : తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అనే విశ్రాంతి అధికారిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అనేక పర్యాయాలు విచారించారు. ఏకంగా ఆయనను అమెరికా నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని.. ఆయనను స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారిస్తున్నారు.
RK phone tap : ఇక ప్రత్యేక దర్యాప్తు అధికారుల విచారణలో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతలను మాత్రమే కాకుండా.. పాత్రికేయుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వార్తలు వస్తున్నాయి. అందులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కూడా ఉండడం సంచలనం కలిగిస్తోంది. ఈయన ఫోన్ ట్యాప్ చేశారని.. ఆయన మాటలు కూడా విన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల విచారణకు హాజరవుతారని.. ఇప్పటికే వేమూరి రాధాకృష్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సమాచారం కూడా అందిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏబీఎన్ లో ప్రసారం చేశారు.. నాడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన అక్రమాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చిందని.. ఆ అక్కసుతోనే ప్రభుత్వం కక్ష కట్టిందని.. ఏకంగా ఫోన్ ట్యాప్ చేసిందని ఏబీఎన్ లో కథనాలు ప్రసారమవుతున్నాయి.
ట్యాప్ ఎలా చేశారు
వేమూరి రాధాకృష్ణ చేతిలో ఒక డబ్బా ఫోన్ ఉంటుంది. సాధారణంగా దానిని చాలామంది డబ్బా ఫోన్ అనుకుంటారు. కానీ అది అమెరికా నుంచి తెప్పించిందట. ఓ ప్రఖ్యాత సంస్థ తయారు చేసిన ఫోన్ ను రాధాకృష్ణ వాడుతున్నాడు. ఈ ఫోన్ ను ట్యాప్ చేయడానికి ఆస్కారం లేదని సంస్థల ఉద్యోగులు చర్చించుకుంటారు. అయితే అటువంటి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారంటే ఏ స్థాయిలో సాఫ్ట్ వేర్ వాడి ఉంటారోననే చర్చ నడుస్తోంది. కెసిఆర్ అధికారంలో ఉన్నన్నీ రోజులు రాధాకృష్ణకు ఉప్పూ నిప్పూ లాగానే వ్యవహారం సాగింది. మొదట్లో కొద్ది రోజులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలు పొడ చూపాయి. ఇక కెసిఆర్ అధికారులకు వచ్చిన తొలి రోజుల్లో ఏబీఎన్ మీద నిషేధం విధించారు. తెలంగాణలో ప్రసారాలు జరగకుండా తొక్కేశారు. నాడు ఇదే విషయంపై రాధాకృష్ణ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టులో కేసు గెలిచి విజయం సాధించారు.
అందువల్లే వ్యతిరేకత పెంచుకున్నారా?
ముఖ్యంగా ప్రభుత్వపరంగా జరుగుతున్న వ్యవహారాలను.. అందులో అవకతవకలను రాధాకృష్ణ తన పత్రిక ద్వారా.. తన ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక రకంగా కెసిఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. దీంతోనే రాధాకృష్ణ మీద వ్యతిరేకత పెంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అప్పట్లో తనకు నచ్చని లీడర్లతో ఆర్కే టచ్ లో ఉన్నారని . తన పత్రికలో చోటు కల్పించారని.. తన చానల్లో సింహ భాగం కేటాయించారని.. అందువల్లే రాధాకృష్ణ మీద కెసిఆర్ ఒక కన్ను వేసి ఉంచారని .. చివరికి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తోంది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల విచారణలో రాధాకృష్ణ ఎటువంటి విషయాలు వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది.