Rishabh Pant overseas centuries : భారత్ భారీ స్కోర్ చేయడంలో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ లీడ్స్ మైదానంలో దుమ్మురేపాడు. వాస్తవానికి సెకండ్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ గనుక బీభత్సంగా బ్యాటింగ్ చేయకపోతే టీమిండియా ఆస్థాయిలో ఇంగ్లాండ్ ఎదుట లక్ష్యాన్ని ఉంచేది కాదు. అయితే ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమ్ ఇండియా విఫలమైంది. బౌలర్లు చేతులెత్తేశారు. ఫీల్డర్లు తలవంచారు. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఐదు గురు ప్లేయర్లు సెంచరీలు చేసినప్పటికీ.. ఒక బౌలర్ ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. గెలుపును దక్కించుకోలేక పరువు పోగొట్టుకున్నారు.
టీమ్ ఇండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. తెరపైకి మరో విషయం కూడా ఇప్పుడు ఒకటి వచ్చింది. రిషబ్ పంత్ వరుసగా రెండు సెంచరీలు చేయడమే టీం ఇండియా ఓటమికి కారణమని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. విదేశాలలో రిషబ్ పంత్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్ (ఒకటి డ్రా అయింది) భారత జట్టు ఓడిందని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో ఇంగ్లాండ్ జట్టుపై సెంచరీ చేసాడు రిషబ్ పంత్. ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. 2019లో ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ చేస్తే ఆ మ్యాచ్ డ్రా అయింది. 2022లో సౌత్ ఆఫ్రికా పై సెంచరీ చేస్తే ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. 2022 లోనే ఇంగ్లాండ్ జట్టుపై సెంచరీ చేస్తే.. ఆ మ్యాచ్ కూడా భారత్ ఓడిపోయింది. 2025లో ఇంగ్లాండ్ జట్టుపై ఏకంగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేస్తే భారత జట్టు ఓటమిపాలైంది. మొత్తంగా ఐదు మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లలో రిషబ్ పంత్ సెంచరీలు సాధించాడు. అయినప్పటికీ భారత్ ఓడిపోవడం విశేషం.
” రిషబ్ అద్భుతంగా ఆడతాడు. ఇంగ్లాండ్ సిరీస్ లోనూ అదరగొట్టాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ప్రారంభంలో నిదానంగా ఆడిన అతడు.. ఆ తర్వాత దుమ్ము రేపాడు. మైదానంలో పరుగుల వరద పారించాడు. చివరికి భారత్ గెలవకపోవడంతో ఈ అపప్రదనం మూటకట్టుకుంటున్నాడు. సెంచరీలు చేసిన ఇలాంటి ఆపకీర్తిని చవిచూడటం రిషబ్ పంత్ కు దక్కి ఉంటుంది. అయితే ఓటమికి , రిషబ్ పంత్ సెంచరీలకు కారణం ఉండదు. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు సెంచరీలు చేశాడు. భారీగా పరుగులు సాధించేలా చేశాడు. అటువంటి ఆటగాడిని ఇలా విమర్శించడం ఏమాత్రం సరికాదు. అతడు ఇలాగే ఆడుతూ ఉండాలని” అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.