Kannappa movie IT raids : మరో రెండు రోజుల్లో మంచు విష్ణు(Manchu Vishnu) హీరో గా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించారు. సినిమా విడుదల టెన్షన్ లో మూవీ టీం మొత్తం ఉన్న సమయంలో ఐటీ అధికారులు మంచు విష్ణు హైదరాబాద్ కార్యాలయం పై సోదాలు నిర్వహించడానికి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు ఆఫీస్ తో పాటు ఆయన నివాసం ఉంటున్న ఇల్లు, అలాగే ఈ సినిమాకు ఫైనాన్షియల్ లావాదేవీల్లో ఉన్న పలువురి పై జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నప్ప బడ్జెట్ వివరాల పై ఆరాలు తీసిన అధికారులు, టాక్స్ మరియు జీఎస్టీ ఎగవేసినట్టు ఆరోపణలు చేశారు.
ఇప్పుడు ఇది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మంచు విష్ణు ని కన్నప్ప బడ్జెట్ ఎంతో చెప్పమని యాంకర్ అడుగుతాడు. ఇప్పుడు వాటి గురించి వివరాలు ఎందుకు, మళ్ళీ ఐటీ అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతారు, ఆ తల నొప్పులు భరించాలి అని అంటాడు. నాకు ఐటీ సోదాలు జరిగితే సంతోషమే,కానీ నా స్టాఫ్ అకస్మాత్తుగా సోదాలు అంటే భయపడుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఎదో సరదాగా ఐటీ అధికారులు మా మీద రైడింగ్ చేస్తారు ఎందుకొచ్చింది సమస్య ని మంచు విష్ణు అంటే, నిజంగానే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడానికి రావడం గమనార్హం. అయితే అదే ఇంటర్వ్యూ లో ఆయన ఈ ఏడాది విడుదల అవ్వబోయే పాన్ ఇండియన్ సినిమాలన్నిటికంటే ఈ చిత్రానికే ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయ్యిందని చెప్పుకొచ్చాడు.
అంతే కాదు ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రాలకంటే ఈ సినిమాకే ఎక్కువ ఖర్చు అయ్యింది అని చెప్పుకొచ్చాడు. అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ ఖర్చు అయ్యిందని చెప్పకనే చెప్పాడు. అందుకే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడానికి ఇంటికి వచ్చి ఉంటారని అనుకుంటున్నారు. మరోపక్క మంచు మనోజ్(Manchu Manoj) కూడా కారణం అయ్యుండొచ్చు అని మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలంగ్తా మంచు విష్ణు తో మంచు మనోజ్ కి గొడవలు ఎలాంటివో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదల సమయంలో కన్నప్ప టీం ని ఇబ్బంది పెట్టడానికే మంచు మనోజ్ ఐటీ అధికారులకు కావాలని సమాచారం అందించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. మరి ఐటీ సోదాలపై మంచు విష్ణు నే సమాధానం చెప్పాలి.
హైదరాబాద్: కన్నప్ప చిత్ర యూనిట్‌పై జీఎస్టీ సోదాలు.. మంచు విష్ణుతో పాటు పలువురి ఇళ్లల్లో జీఎస్టీ తనిఖీలు.. మాదాపూర్‌లోని మంచు విష్ణు కార్యాలయంలో సోదాలు.. కన్నప్ప సినిమా బడ్జెట్ వివరాలపై ఆరా.. టాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు#Tollywood #Kannappa #Hyderabad #BreakingNews…
— NTV Breaking News (@NTVJustIn) June 25, 2025