Pawan Kalyan Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ప్రస్తుతం ఎన్ని కష్టాల్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్నేళ్ల పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ఒక సినిమా విడుదలకు ముందు ఇన్ని ఇబ్బందులను ఎదురుకోవడం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ సినిమా ఐదేళ్ల క్రితం ప్రారంభం అవ్వడం, మధ్యలో ఎన్నోసార్లు వివిధ కారణాల చేత షూటింగ్ ఆగిపోవడం, చిత్రం పై అనేక నెగెటివ్ ప్రచారాలు జరగడం, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంటుంది. ఈ ఒక్క ఏడాది లోనే ఈ సినిమాకు మూడు సార్లు డేట్స్ మార్చారు. పోనీ ప్రమోషనల్ కంటెంట్ అద్భుతంగా ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు ఒక్కటి కూడా ఫ్యాన్స్ ని అలరించలేదు. గ్లింప్స్ వీడియోలు కూడా అంతంత మాత్రంగానే ఆకట్టుకున్నాయి. దీంతో అభిమానులకు ఈ చిత్రం పై ఆసక్తి పోయింది.
పైగా ఈ చిత్రానికి ‘ఓజీ’ కారణంగా చాలా దెబ్బ పడుతుంది. ఈ చిత్రం పై ట్రేడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బాహుబలి, సలార్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ఈ చిత్రానికి అలాంటి క్రేజ్ ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. ‘హరి హర వీరమల్లు’ కి ‘ఓజీ’ కి పెద్ద గ్యాప్ లేకపోవడం తో, ఇది ఎలాగో పొయ్యే సినిమానే, ఓజీ తో చూసుకుందాం అని అభిమానులు సైతం సోషల్ మీడియా లో బహిరంగంగా చెప్తున్నారు. అభిమానుల్లోనే ఈ చిత్రం పై అలాంటి అంచనాలు ఉంటే, ఇక సాధారణ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం. అందుకే ఈ సినిమాకి భారీ లెవెల్ లో హైప్ క్రియేట్ అవ్వాలంటే కచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ క్లిక్ అవ్వాలి.
మరో రెండు మూడు రోజుల్లో ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక నిర్మాత AM రత్నం పరిస్థితి ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏ నిర్మాతకు ఇవ్వని బంపర్ ఆఫర్ AM రత్నం కి ఇచ్చాడు. సాధారణంగా తన సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడడు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొంటాడు. కానీ ఈ సినిమా వరకు హిందీ ప్రొమోషన్స్ లో పాల్గొంటానని,అదే విధంగా తెలుగు లో కూడా ప్రత్యేకంగా పలు ఇంటర్వ్యూస్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఈ భరోసా ఇవ్వడంతో నిర్మాత AM రత్నం ముఖం మతాబు లాగా వెలిగిపోయింది. మరి ఉప ముఖ్యమంత్రిగా ఎంతో బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్,ఈ సినిమా ప్రొమోషన్స్ కి సమయం ఎలా కేటాయిస్తాడో చూడాలి.