
Rama Rajamouli: టాలీవుడ్ లో ఎంతో అన్యోయంగా కనిపించే జంటలలో ఒకటి రాజమౌళి మరియు రమా జంట.వీళ్లిద్దరి పెళ్లి స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే జరిగింది. రమా రాజమౌళి కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద అనే విషయం అందరికీ తెలిసిందే.దానికి తోడు రాజమౌళి తో ఆమెకి ఇది రెండవ పెళ్లి, కార్తికేయ కూడా మొదటి భర్త కి పుట్టిన బిడ్డ.అయితే రమా ని మొదటి భర్త ఎన్నో చిత్ర హింసలకు గురి చేసాడట.
సంపాదించిన డబ్బులు మొత్తం మందు మరియు ఇతర చెడు వ్యసనాల కోసం ఉపయోగించేవాడట.కానీ రమా ఇదంతా నా ఖర్మ అనుకోని అతనిని భరిస్తూ జీవనం కొనసాగించిందట.రోజు రోజుకి అతని ఆగడాలు భరించలేక కార్తికేయ ని తీసుకొని తన చెల్లెలు శ్రీవల్లి ఇంటికి వెళ్లిపోయిందట.ఇతగాడు అక్కడకి కూడా వచ్చి గొడవలు చేసేవాడట, ఇక అతనిని భరించడం తన వల్ల కాక విడాకులకు దరఖాస్తు చేసింది.విచారణ జరిపిన తర్వాత కోర్టు వీళ్లిద్దరు విడాకులను 2000 సంవత్సరం లో మంజూరు చేసింది.
రమా ని ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ దుర్మగుడు ఎవరు, ఏమిటి అనే విషయాన్నీ తెలుసుకునేందుకు నెటిజెన్స్ గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు కానీ, ఆమె మొదటి భర్త కి సంబంధించి ఒక్క విషయం కూడా బయటపడలేదు.అయితే మాకు అందిన కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,రమా రాజమౌళి గారి మొదటి భర్త టాలీవుడ్ లో టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు అట.అతను ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడట,కీరవాణి సూచన మేరకే ఈ పెళ్లి జరిగిందని, కానీ అతను అంత దుర్మార్గుడనే విషయం పసిగట్టలేకపోయాయని కీరవాణి ఇప్పటికీ భాద పడుతూనే ఉంటాడట.

ఇక శాంతినివాసం సీరియల్ చేస్తున్న సమయం లో రాజమౌళి పరిచయం అయ్యడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, పెళ్లి చేసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి.మొదటి భర్త కి పుట్టిన కార్తికేయ ని మనస్ఫూర్తిగా తన కొడుకుగా స్వీకరించాడు, అతనికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చి, అంగరంగ వైభవంగా పెళ్లి కూడా జరిపించాడు రాజమౌళి.కార్తికేయ తన తండ్రి నుండి విడిపోయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదట.