
India vs Australia 3rd Test: నాగ్ పూర్ మ్యాజిక్ పని చేయలేదు. ఢిల్లీ ధమాకా వర్క్ అవుట్ అవ్వలేదు. మూడో టెస్ట్ గెలవాలని కోటి ఆశలతో ఇండోర్ గ్రౌండ్లో అడుగుపెట్టిన భారత జట్టుకు ఆది లోనే హంసపాదు ఎదురయింది.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 88 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా నాదన్ లయాన్ ధాటికి వణికి పోయింది..ఒక్క పుజారా, అయ్యర్ తప్ప ఎవరూ సరయిన స్కోర్ సాధించలేకపోయారు. పుజారా చేసిన 59 పరుగులే ఇండియా తరపున అత్యధిక స్కోర్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం సీమర్లకు అనుకూలించిన పిచ్.. మధ్యాహ్నం వరకు అనుకూలంగా మారిపోయింది.. దీంతో లయాన్ విజృంభించి బౌలింగ్ చేశాడు.. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్…ఇలా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లయాన్ బౌలింగ్ ధాటికి వెంట వెంటనే అవుట్ అయ్యారు.

గత రెండు టెస్టుల్లో విఫలమైన పూజార రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు.. తోటి బ్యాట్స్మెన్ వెంట వెంటనే అవుట్ అవుతున్న నేపథ్యంలో తాను ఒక్కడే నిలబడ్డాడు. 59 పరుగులు చేశాడు. ఒక్క అయ్యర్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ సహకరించకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. అతను కూడా లయాన్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక భారత్ చివరి మూడు వికెట్లు 8 పరుగుల వ్యవధి లో కోల్పోవడం విశేషం. ఇక ఆసీస్ బౌలర్లలో లయాన్ 8 వికెట్లు తీశాడు. స్టార్క్, కునేమాన్ తలా ఒక వికెట్ తీశారు. ఇక భారత్ ఆసీస్ ముందు 75 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు బౌలర్ల ప్రదర్శన మీదే భారత్ విజయం ఆధారపడి ఉంది.. అయితే అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలిచే పరిస్థితులు లేవు.