
Steve Smith- Jadeja: బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు రోజు రసవత్తరంగా సాగింది. ఆతిథ్య జట్టు కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఎవరూ కూడా ఆసీస్ బౌలర్లను నిలువరించలేకపోయారు.. అయితే భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మరోసారి విజృంభించాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు. అయితే రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టినప్పటికీ అతని ప్రదర్శనతో కెప్టెన్ రోహిత్ శర్మ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే జడేజా కోరిన రివ్యూలు వృథా అవడమే. దీని వల్ల జట్టు చాలా అవకాశాలు కోల్పోయింది.
మరోవైపు ఉస్మాన్ ఖవాజా చేసిన 60 పరుగుల మంచి స్కోరు నేపథ్యంలో ఆస్ట్రేలియా రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 47 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ రోజు చివరి సెషన్‌లో రవీంద్ర జడేజా, స్టీవ్ స్మిత్ మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఉస్మాన్ ఖవాజాకు జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు, అతను బంతిని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు, అయితే రవీంద్ర జడేజా బంతి కోసం వెళ్ళడానికి ప్రయత్నించి స్మిత్ ను ఢీకొన్నాడు.ఈ సమయంలో స్లిప్స్ వద్ద నిలబడి ఉన్న విరాట్ కోహ్లి జడేజాకు కన్ను కొట్టి కావాలనే ఢీ కొట్టావు కదా అని అర్థం వచ్చేలా సైగ చేశారు. ఇది ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ కు కోపం తెప్పించింది. దీంతో స్మిత్ సహనం కోల్పోయాడు.. రవీంద్ర జడే జాను తిట్టాడు.. దీనికి రవీంద్ర కూడా మంచి కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో స్మిత్ ను ఎలాగైనా ఔట్ చేయాలని జడేజా పదునైన బంతులు వేశాడు. డబ్ల్యు డబ్ల్యు ఈ లో రిగ్ మాదిరి స్మిత్ చుట్టూ ఫీల్డింగ్ ను మోహరింప చేశాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ సింగిల్ తీసేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.. మరోవైపు జడేజా తన నోటికి పని చెప్పాడు.

ఇక తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టినప్పటికీ అతడు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఎందుకంటే రవీంద్ర జడేజా ఖవాజా వికెట్ కోసం జడేజా జడేజా రెండు రివ్యూలు వృథా చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తో రివ్యూ తీసుకునేలా చేశాడు జడేజా వేసిన ఆరో ఓవర్లో ఖవాజా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఎల్బీ డబ్ల్యూ కోసం టీం ఇండియా అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే బంతి లైన్ లో పడి వికెట్ల పైకి వెళ్తోందని రోహిత్ కు చెప్పిన జడేజా రివ్యూ కోరాలని పట్టుబట్టాడు.. దీంతో రోహిత్ శర్మ డీఆర్ఎస్ కోరగా రిప్లై లో బంతి అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పై పడినట్టు కనిపించింది. దీంతో రివ్యూ వృధా అయ్యింది. తర్వాత 10 ఓవర్లో మరోసారి జడేజా బౌలింగ్లో ఖవాజా వికెట్ల ముందు దొరికి పోయాడు. మళ్ళీ జడేజా రిక్వెస్ట్ చేయడంతో రోహిత్ శర్మ రివ్యూ కోరాడు. కానీ ఈసారి బంతి లెగ్ స్టంప్ న కు దూరంగా వెళుతున్నట్టు రిప్లై లో కనిపించింది.. దీంతో రెండోసారి కూడా రివ్యూ వృధా అయ్యింది..