
Brother Married Sister: కలియుగంలో మనుషుల ప్రవర్తన మారుతోంది. వావివరసలు మరుస్తున్నారు. జంతువుల వలే అనుకుంటున్నారు. సనాతన హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లది విశిష్ట బంధుత్వం. అన్న కోసం చెల్లెలు చెల్లి కోసం అన్న ఎంతో తపిస్తారు. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగం కూడా ఎంతో ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. తమ చెల్లికి మంచి వరుడిని చూసి పెళ్లి చేయాలని ప్రతి అన్న కోరుకుంటాడు. కానీ ఏదో కక్కుర్తి పడి సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. వావివరసలు మాని అన్నాచెల్లెళ్ల బంధాన్ని అపవిత్రం చేస్తున్నారు.
Also Read: MLC Kavitha: కళ తప్పిన కవిత.. అరెస్ట్ భయమే ఆమెను వెంటాడుతుందా!?
ఎందుకీ కక్కుర్తి?
సొంత చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. అసలేం జరిగింది. ఈ ఘటనలో తప్పెవరిది? అనే కోణంలో విచారిస్తే ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు తలొగ్గి వావివరసలు మరిచిపోయాడు. సొంత చెల్లెలినే వివాహం చేసుకుని కళంకం తీసుకొచ్చాడు. అన్నా చెల్లెళ్ల బంధానికి అవమానం కలిగించాడు. ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదని అందరు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నజరానాల కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఎవరు చేయని పని చేసి అందరి చేత ఛీ అనిపించుకుంటున్నాడు.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో నివాసముండే దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు యుక్త వయసుకు వచ్చారు. దీంతో తల్లిదండ్రులు ముందు ఆడపిల్ల పెళ్లి చేసి తరువాత కొడుకుకు వివాహం చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో టుండ్లా బ్లాక్ ఏరియాలో సామూహిక వివాహాలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 51 జంటలను ఎంపిక చేసి వారికి ప్రభుత్వమే దుస్తులతో పాటు పెళ్లి ఖర్చులు, గృహోపకరణాలు అందజేసింది. దీంతో వాటిని పొందాలనే కక్కుర్తితో ఓ మూర్ఖుడు సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు పొందాలని ఇలా చేశాడు. దీంతో ఇది వివాదాస్పదమైంది.

అధికారుల కళ్లు గప్పి
విషయం తెలుసుకున్న అతడు చెల్లినే వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి ఖర్చులు, గృహోపకరణాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలియడంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన గతంలోనే జరిగినా ఇప్పుడు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న ఉదంతం తెలియడంతో అందరు అవాక్కవుతున్నారు. అతడి తీరుకు విమర్శలు పెరుగుతున్నాయి. అలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.