Homeఎంటర్టైన్మెంట్శ్రీముఖిపై హాట్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది.!

శ్రీముఖిపై హాట్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది.!

Aadhi Sreemukhu

పండుగల సమయంలో ఛానెళ్లు స్పెషల్ కార్యక్రమాలు నిర్వహించడం ఇటీవలీ కాలంలో ఆనవాయితీగా మారింది. ఈటీవీ.. జెమిని.. జీటీవీ.. మాటీవీ వంటి ఛానళ్లు రోజంతా స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు అలరిస్తున్నాయి. పండుగ అంతా కూడా బుల్లితెరపైనే జరుగుతుందా? అన్న రీతిలో ప్రొగ్రాంలను నిర్వహించడం ఈ ఛానళ్ల ప్రత్యేకతగా చెప్పొచ్చు.

Also Read: బిగ్ బాస్ లోకి మరో హీరో ఎంట్రీ.. టీఆర్పీ కోసం కష్టపడుతున్న నాగ్?

ఇటీవల దసరా సందర్భంగా ఈటీవీలో ‘అక్కా ఎవరే అతగాడు’ అనే స్పెషల్ కార్యక్రమం జరిగింది. ఇందులో నవదీప్ యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వగా రోజాకు బదులుగా సంగీత ప్రత్యేకంగా కన్పించి ఆకట్టుకుంది. మరోవైపు జీ తెలుగులో ప్రదీప్ శ్రీముఖిలపై స్పెషల్ ఈవెంట్ చేశారు. కాగా దీపావళికి మాత్రం ఈటీవీ మాత్రమే రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది.

దీపావళి సందర్భంగా ఈటీవీలో ‘కనక మహాలక్ష్మీ లక్కీ డ్రా’ పేరుతో ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో సంగీత దర్శకుడు అనూష్ రెబెన్స్ తన పిల్లలతో కలిసి పాటలు పాడించి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ కార్యక్రమంలో సోనూసుద్ ఎంట్రీ ఇవ్వడంతో కార్యక్రమం మరో లెవల్ కి వెళ్లినట్లు కన్పిస్తోంది. ఈటీవీ తాజాగా మరో ప్రోమోను విడుదల చేసింది.

Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ టీం మోహన్ బాబును సరిగ్గా వాడుకోలేదా?

ఇందులో హైపర్ ఆది శ్రీముఖిపై అదిరిపోయే పంచ్ వేసి ఆకట్టుకున్నాడు. ఈవెంట్‌కు యాంకరింగ్ చేస్తోన్న శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. దసరా ఈవెంట్ కు ఆ చానల్లో.. దీపావళి ఈవెంట్ ఈ చానల్లో చేస్తున్నావ్ అంటూ ఓ పంచ్ వేశాడు. శ్రీముఖిని భూచక్రంగా అభివర్ణించి అన్ని షోలను కవర్ చేస్తుందంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో శ్రీముఖి తలపట్టేసుకుంది. ఈ స్పెషల్ ఈవెంట్ దీపావళి రోజున బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం ఖాయంగా కన్పిస్తోంది.

Sri Kanaka Mahalakshmi Lucky Draw|ETV Diwali Special Event 2020| Sudheer,Sri Mukhi |All In One Promo

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version