https://oktelugu.com/

బిగ్ బాస్ లోకి మరో హీరో ఎంట్రీ.. టీఆర్పీ కోసం కష్టపడుతున్న నాగ్?

ఎన్నో అడ్డంకులను దాటుకొని బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈసారి బిగ్ బాస్ లో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడంతో టీఆర్పీ మాత్రం అనుకున్న స్థాయిలో రావడంలేదు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు రకరకాల టాస్కులు నిర్వహిస్తూ టీఆర్పీ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ టీం మోహన్ బాబును సరిగ్గా వాడుకోలేదా? నాగార్జున ఇటీవల తన వైల్డ్ డాగ్ షూటింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 04:31 PM IST
    Follow us on

    ఎన్నో అడ్డంకులను దాటుకొని బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈసారి బిగ్ బాస్ లో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడంతో టీఆర్పీ మాత్రం అనుకున్న స్థాయిలో రావడంలేదు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు రకరకాల టాస్కులు నిర్వహిస్తూ టీఆర్పీ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ టీం మోహన్ బాబును సరిగ్గా వాడుకోలేదా?

    నాగార్జున ఇటీవల తన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులుమానాలి వెళ్లడంతో ఆయన స్థానంలో సమంత హోస్ట్ చేసి అలరించింది. ఆ షో నుంచి టీఆర్పీ మళ్లీ దూసుకుపోతుందని ఆశించారు. సమంత ఎపిసిడ్ కు ఆశించిన టీఆర్పీ వచ్చినా దానిని కొనసాగించడంలో నిర్వాహకులు విఫలమవుతున్నారు.

    బిగ్ బాస్-4 కేవలం వీకెండ్ రోజుల్లో మాత్రమే మంచి టీఆర్పీ సాధిస్తుండగా మిగతా రోజుల్లో మాత్రం దారుణంగా పడిపోతుందని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహాకులు టీఆర్పీని పెంచేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సుమ కనకాలను వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ లోకి పంపుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. చివరకు దీనిని కామెడీగా చూపించి తుస్సు మనిపించారు. అయితే ఈ ఎపిసోడ్ బాగానే వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాజాగా నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్.. కోడలు సమంత సందడి చేశారు. తాజాగా చైతూ కూడా ఎంట్రీ ఇస్తాడనే టాక్ విన్పిస్తోంది. పనిలో పనిలో నాగచైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషన్ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న చైతూ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!