
కరోనా బారిన పడి ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ రచయిత వంశీ రాజేశ్ కరోనాతో మరణించారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారు. రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ అంటోని‘ సినిమాకు రచయితగా పనిచేశారు. వంశీ మృతి పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గత రెండు నెలల కిందట కరోనాటో బాల సుబ్రహ్మణ్యం మరణించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కరోనా బారినపడి మరణించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు.